పెట్రో కెమికల్స్ రిఫైనరీ ఏర్పాటుకు స్థల పరిశీలన
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:22 AM
సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్టుకు సమీపంలో పెట్రో కెమికల్స్ రిఫైనరీ ఏర్పాటుకు హెచ్‌ఎంఈఎల్ పరిశ్రమ ప్రతినిఽధులు బుధవారం స్థలాన్ని పరిశీలించారు.
టెక్కలి, జూలై 9(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్టుకు సమీపంలో పెట్రో కెమికల్స్ రిఫైనరీ ఏర్పాటుకు హెచ్‌ఎంఈఎల్ పరిశ్రమ ప్రతినిఽధులు బుధవారం స్థలాన్ని పరిశీలించారు. రెండువేల ఎకరాల పరిధిలో రూ.50వేల కోట్ల పెట్టుబడితో రిఫైనరీ ఏర్పాటుక ఆ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మేరకు సమీర్‌పేట లాజిస్టిక్స్‌కు చెందిన 1,800 ఎకరాల ఉప్పు భూమును ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వీరికి పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ద్వారా ఏయే వనరులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి వివరించారు. ప్రధానంగా రైలు, రోడ్డు కనెక్టివిటీ, అవసర మైన విద్యుత్, నీటి సదుపాయం కల్పించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే పోర్టు ప్రాంతంలో సౌత్‌బ్రేక్ బెర్త్‌ల నిర్మాణాన్ని మిటల్ గ్రూప్ ప్రతినిధులు పరిశీలించారు. ఇప్పటికే కోల్‌కత్తాకు చెందిన హల్ది యా పెట్రో కెమికల్స్, పూణేకు సంబంధించిన కళ్యాణి స్టీల్స్, యూకేకు చెందిన గ్రీన్ అమోనియా పరిశ్రమ యాజమాన్యం, అమెరికాకు చెందిన ఎగ్జాంబుల్ ప్రతినిధి బృందం సంతబొమ్మాళి మండలం పరిధిలో పోర్టు చుట్టూ ఉన్న భూములను పరిశీలించిన విషయం విదితమే. ఆయా మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు కోసం ఇప్పటికే అన్వేషణ చేపట్టాయి. పోర్టుకు దగ్గరగా పెట్రో కెమికల్స్ రిఫైనరీ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పరిశీలించారు. ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి రెవెన్యూ అధికారుల బృందంతో కలిసి హెచ్‌ఎంఈఎల్ పరిశ్రమ ప్రతినిధులకు పరిశ్రమ ఏర్పాటుకు వనరులు ఆవశ్యకత వివరించారు.
Updated Date - Jul 10 , 2025 | 12:22 AM