సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలి
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:04 AM
ఫీల్డ్ అసిస్టెంట్లను సచివాలయ ఉద్యోగు లుగా గుర్తించాలని, 19సంవత్సరాల సర్వీసును ప్రామాణికంగా తీసుకుని, తత్సమాన జీత భత్యాలు చెల్లించాలని క్షేత్రసహాయకుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ఫీల్డ్ అసిస్టెంట్లను సచివాలయ ఉద్యోగు లుగా గుర్తించాలని, 19సంవత్సరాల సర్వీసును ప్రామాణికంగా తీసుకుని, తత్సమాన జీత భత్యాలు చెల్లించాలని క్షేత్రసహాయకుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక డచ్ బంగ్లా వద్ద సమావేశమై అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసనప్రదర్శన నిర్వహించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 28 నుంచి నిరవధికసమ్మె చేపడతామని తెలిపారు. కార్యక్ర మంలో జి.ధర్మారావు, శ్యామలరావు, సుమారు 100 మంది సభ్యులు పాల్గొన్నారు.
కేబుల్ ఆపరేటర్లను ఆదుకోండి
అరసవల్లి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ఏపీ ఫైబర్‌ను కాపాడి కేబుల్ ఆపరేటర్లను ఆదు కోవాలని ఏపీకేబుల్ ఆపరేటర్ల జేఏసీ నాయకులు గిరి,సభ్యులు కోరారు. శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 2016లో ఏపీ ఫైబర్ రూపంలో చంద్రబాబునాయుడు ప్రోత్సహించారని, 2019 వరకు 10.5లక్షల కనెక్షన్లతో సంస్థ నడిచిందని, కానీ గత ప్రభుత్వ హయాంలో అది నాలుగు లక్షలకు పడి పోయిందని తెలిపారు.ప్రస్తుతం ఏపీ ఫైబర్ మూతపడే స్థితికి చేరుకుందని చెప్పారు. సంస్థ మూతపడితే కోట్లరూపాయలు పెట్టుబడిపెట్టిన ఆప రేటర్లు ఆత్మహత్య చేసుకోవా ల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సమ స్యలపై ముఖ్యమంత్రిదృష్టి సారించి ఏపీ ఫైబర్‌ను, ఆపరేటర్స్‌ను కాపాడాలని కోరారు.
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలి
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్)న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ డిమాండ్ చేశారు.శ్రీకాకుళంలోని జడ్పీకార్యాలయం ఎదుట రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్‌లో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ప్రగతిశీల మహిళా సంఘం పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఎస్.కృష్ణవేణి, మామిడి.భీమారావు, పాపయ్య, బొమ్మాళిబాలకృష్ణ, వంకల మాధవరావు, సన్నశెట్టి రాజశేఖర్ పాల్గొన్నారు.
Updated Date - Apr 22 , 2025 | 12:04 AM