EAP CET: ఈఏపీసెట్‌లో మెరిశారు
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:25 AM
EAPCET Top Rankers ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌లో ప్రవేశానికిగాను నిర్వహించిన ఈఏపీసెట్‌లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకును ఓ విద్యార్థి కైవసం చేసుకోగా.. పలువురు జిల్లా టాపర్లుగా నిలిచారు.
జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
శ్రీకాకుళం/ నరసన్నపేట, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌లో ప్రవేశానికిగాను నిర్వహించిన ఈఏపీసెట్‌లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకును ఓ విద్యార్థి కైవసం చేసుకోగా.. పలువురు జిల్లా టాపర్లుగా నిలిచారు.
ఇంజనీరింగ్ విభాగంలో... జిల్లా నుంచి 5,548 మంది బాలురు, 3,886 మంది బాలికలు.. మొత్తం 9,434 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 9,062 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఆదివారం ఫలితాలు విడుదల కాగా.. 6,402 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,711 మంది బాలురు, 2,691 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో... జిల్లా నుంచి 3,864 మంది విద్యార్థులు(691 మంది బాలురు, 3,173 మంది బాలికలు) పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,571 మంది పరీక్షకు హాజరయ్యారు. 3,135 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 579 మంది బాలురు, 2,556 మంది బాలికలు ఉన్నారు.
శభాష్ జ్ఞాన రుత్విక్
ఈఏపీసెట్ ఫలితాల్లో నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్‌సాయి రాష్ట్రస్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాఽధించారు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆలిండియాస్థాయిలో 18వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో ఒకటో స్థానం సాధించిన విషయం తెలిసిందే. జ్ఞాన రుత్విక్‌సాయి తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తల్లి కొండల లత నరసన్నపేట బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తండ్రి ధర్మాన శంకరనారాయణ చెన్నాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో తొమ్మిదో ర్యాంకు రావడంతో జ్ఞాన రుత్విక్‌సాయిని కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు. అలాగే నరసన్నపేటలోని మారుతీనగర్‌కు చెందిన డా. సూరపు ఝాన్సీ లక్ష్మీ శృతి ఏపీఈఏపీసెట్‌లో అగ్రికల్చర్ అండ్ ఫార్మశీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 11వ ర్యాంకు సాధించారు. ఝాన్సీ లక్ష్మీశృతి విజయవాడలోని ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివారు. తండ్రి డా.కృష్ణారావు పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి మెండ సుధారాణి చిన్నపిల్లలు వైద్యనిపుణులు. జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్‌లో ప్రతిభ చూపి.. వైద్యవృత్తిలో స్థిరపడటమే తన లక్ష్యమని ఝాన్సీ లక్ష్మీశృతి తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగంలో జిల్లా టాపర్లు
--------------------------------------------------------------------------------------------------------------------------
పేరు ర్యాంకు ప్రాంతం స్కోరు
--------------------------------------------------------------------------------------------------------------------------
ధర్మాన జ్ఞాన రుత్విక్‌సాయి 9 నరసన్నపేట 92.5155
బుడుమూరు విక్రమరాజ 21 ఎచ్చెర్ల 91.4935
సిగిలిపెల్లి ప్రణీత్‌సాయి భరత్ 63 టెక్కలి 87.7342
బండారు రోహిత్ దత్త 83 ఎచ్చెర్ల 86.2985
సాసనపురి నిర్మిత్ 128 పాతపట్నం 83.7282
బోయిన లక్ష్మీనివాస్ 148 శ్రీకాకుళం 83.0967
కరకవలస సుమిత్ 163 ఆమదాలవలస 82.4487
పప్పు ప్రశాంత్ కార్తీక్ 166 పాతపట్నం 82.3104
పైడి వెంకటశ్రీ వినయ్ 180 పొందూరు 81.9540
లుకలాపు చరణ్ సాయి 204 సారవకోట 80.9884
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో జిల్లా టాపర్లు
--------------------------------------------------------------------------------------------------------------------------
పేరు ర్యాంకు ప్రాంతం స్కోరు
--------------------------------------------------------------------------------------------------------------------------
సూరపు ఝాన్సీలక్ష్మీ శృతి 11 నరసన్నపేట 91.0829
సనపల వెంకటసాయి శ్రీనివాస్ 17 సరుబుజ్జిలి 89.7888
తార్ర మైత్రి 33 పోలాకి 88.3352
గొద్దు యామిని 42 కోటబొమ్మాళి 87.8351
లకినాన శ్రీకర్ కశ్యప్ 133 కాశీబుగ్గ 82.9176
దాసరి సాయిచరణ్ 172 సంతబొమ్మాళి 81.7184
కుసుమూరు మౌళి 177 శ్రీకాకుళం 81.6207
చాపల స్థితప్రజ్ఞ 180 లావేరు 81.5021
నక్కా నిఖిల్ సాయి కృష్ణ 185 అరసవల్లి 81.2593
ప్రణతి వైశ్యరాజు 193 హిరమండలం 81.1242
Updated Date - Jun 09 , 2025 | 12:25 AM