Ravivalasa: ‘మాటామంతి’కి రావివలస ఎంపిక
ABN, Publish Date - May 21 , 2025 | 12:17 AM
Maatamanti Participant Selection టెక్కలి నియోజకవర్గంలోని రావివలస గ్రామాన్ని మాటామంతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఈ గ్రామంతోపాటు ఎండలమల్లిఖార్జున స్వామి ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది.
రేపు వర్చువల్ విధానంలో గ్రామస్థులతో మాట్లాడనున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
టెక్కలి, మే 20(ఆంధ్రజ్యోతి): టెక్కలి నియోజకవర్గంలోని రావివలస గ్రామాన్ని మాటామంతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఈ గ్రామంతోపాటు ఎండలమల్లిఖార్జున స్వామి ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ‘మాటామంతి’లో భాగంగా ఈ నెల 22న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వర్చువల్ విధానంలో గ్రామస్థులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు మంగళవారం టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి గ్రామస్థులతో సమావేశమయ్యారు. మాటామంతి కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీభాయ్, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, సీఈవో సుధాకర్, టీడీపీ నాయకులు బగాది శేషు, ఎల్‌ఎల్ నాయుడు, బడే జగదీష్, ఇప్పిలి జగదీష్, హెచ్.రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:17 AM