అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
ABN, Publish Date - Jun 14 , 2025 | 11:57 PM
కొత్తకొజ్జిరియాలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద శనివారం వేకువజామున లగేజీ వ్యాన్‌లో తరలిస్తున్న పశువులను పట్టుకున్నామని ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు.
కవిటి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): కొత్తకొజ్జిరియాలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద శనివారం వేకువజామున లగేజీ వ్యాన్‌లో తరలిస్తున్న పశువులను పట్టుకున్నామని ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు. ఒడిశాలోని గొలంత్ర నుంచి ఆరు గేదెలను వ్యాన్‌లో కుక్కి... తిలారు సంతకు తీసు కొని వెళుతుండగా పట్టుకున్నామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నారాయణవలసకు చెందిన డి.ప్రకాశరావుతో పాటు ముగ్గురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. పశువులను కొత్త వలస హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు అప్పగించామని ఆయన చెప్పారు.
11 మంది పేకాట రాయుళ్ల అరెస్టు
వజ్రపుకొత్తూరు, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ఒంకులూరు జీడి తోటల్లో పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ బి.నిహార్ తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శనివారం సాయత్రం మాటువేసి పట్టుకున్నామన్నారు. వీరి నుంచి రూ.26 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గారలో 9 మందిపై కేసు
గార, జూన్ 14(ఆంధ్రజ్యోతి): అచ్చెన్నపాలెం గ్రామం వద్ద శనివారం పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకొని వారి నుంచి రూ.16,920 నగదు స్వాధీనం చేసుకున్నారని ఏఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Updated Date - Jun 14 , 2025 | 11:57 PM