ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chemical waste: ఇది చెరువేనా?

ABN, Publish Date - Jun 27 , 2025 | 12:08 AM

Seethampeta pond Water pollution పరిశ్రమల నిర్వాహకుల తీరు కారణంగా కాలుష్యంతో ఇబ్బందులు తప్పడం లేదని రణస్థలం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి చెంతనే ఉన్న సీతంపేటలో ఊరచెరువు.. బీర్ల పరిశ్రమ రసాయన వ్యర్థాలతో నిండిపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

బీరు పరిశ్రమ వ్యర్థాలతో కలుషితమైన సీతంపేట ఊరచెరువు ఆవేదన చెందుతున్న సీతంపేట గ్రామస్థులు, రైతులు
  • రసాయన వ్యర్థాలతో నిండిన సీతంపేట ఊరచెరువు

  • బీర్ల పరిశ్రమ వ్యవహారంపై గ్రామస్థుల మండిపాటు

  • కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పరిశీలన

  • నీటి నమూనాల సేకరణ

  • రణస్థలం, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల నిర్వాహకుల తీరు కారణంగా కాలుష్యంతో ఇబ్బందులు తప్పడం లేదని రణస్థలం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి చెంతనే ఉన్న సీతంపేటలో ఊరచెరువు.. బీర్ల పరిశ్రమ రసాయన వ్యర్థాలతో నిండిపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. జల, వాయు కాలుష్యం కారణంగా తామంతా అనారోగ్యం బారిన పడుతున్నామని పరిశ్రమ నిర్వాకంపై మండిపడుతున్నారు. గురువారం గ్రామస్థులు, రైతులంతా ఊరచెరువు వద్దకు చేరుకుని తమ ఆవేదన వెల్లగక్కారు. ‘బంటుపల్లి పంచాయతీ పరిధిలోని యునైటెడ్‌ బేవరేజస్‌ బీర్ల పరిశ్రమ విడిచి పెడుతున్న వ్యర్థాలు సమీపంలోని సీతంపేట ఊర చెరువులో కలుస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా రసాయనాలతో కూడిన వ్యర్థాలు విడిచిపెట్టడంతో.. 40 ఎకరాల ఆయకట్టు కలిగిన చెరువు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. చెరువులో మత్స్యసంపద పూర్తిగా కనుమరుగైంది. ఆపై రసాయనాలు పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వస్తోంది. సీతంపేటతోపాటు నగరప్పాలేం, బండిపాలేం పరిసర గ్రామాలకు చెందిన పశువులు, గొర్రెలు, మూగజీవాలు ఈ చెరువులో దాహార్తిని తీర్చుకునేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జల కాలుష్యం కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నాం. ఇదేమని ప్రశ్నిస్తే పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. స్థానికులకు ఉపాధి కల్పించకపోగా.. ఇబ్బందులకు గురి చేస్తున్నార’ని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా గురువారం సీతంపేటలో ఊరచెరువును పరిశీలించారు. చెరువులో నీటి నమూనాలు సేకరించారు. నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించి.. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని కాలుష్య నియంత్రణ మండలి ఏఈ హరీష్‌ తెలిపారు.

  • నీరు పాడైంది..

  • చెరువులో వ్యర్థాలు విడిచిపెడుతుండడంతో పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. పూర్తిగా నీరు పాడైంది. రసాయన వ్యర్థాలు తేలిపోయి దుర్గంధం వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

    - పడాల రామారావు, సీతంపేట

  • భరించలేని దుర్వాసన..

  • ఏడాది పొడవునా నీటితో ఈ చెరువు కళకళలాడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు లేని దుస్థితి. రసాయన వ్యర్థాలు తేలి భరించలేని దుర్వాసన వస్తోంది. సంబంధించి యాజమాన్య ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికారులే చర్యలకు ఉపక్రమించాలి.

    - పడాల రవిబాబు, సీతంపేట

  • చర్యలు తీసుకుంటాం

  • పరిశ్రమల వ్యర్థాలను ఆరుబయట విడిచిపెట్టరాదు. చెరువులు, వాగుల్లోకి వ్యర్థాలను విడిచిపెట్టడం నేరం. వ్యర్థజలాలను పరిశ్రమల్లోనే శుద్ధి చేయాలి. చెరువులను కలుషితం చేసే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం.

    - హరీష్‌, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ, శ్రీకాకుళం

Updated Date - Jun 27 , 2025 | 12:08 AM