గిరిజన రైతులకు విత్తనాలు అందించాలి
ABN, Publish Date - Jun 12 , 2025 | 12:23 AM
గిరిజన రైతులకు ఇబ్బందులు కలుగకుండా విత్త నాలు అందజేయాలని టెక్కలి ఆర్డీవో కృష్ట మూర్తి ఆదేశించారు.
టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి
మెళియాపుట్టి, జూన్ 11(ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులకు ఇబ్బందులు కలుగకుండా విత్త నాలు అందజేయాలని టెక్కలి ఆర్డీవో కృష్ట మూర్తి ఆదేశించారు. బుధవారం మర్రిపాడు- సి రైతుసేవా కేంద్రం, సచివాలయాలను ఆక స్మికంగా తనిఖీ చేవారు. ఎక్కువగా గిరిజన రైతులు రావడాన్ని గమ నించారు. 90 శాతం సబ్సిడీ విత్తనాలు కొందరికి అందలేదని వారు ఆయన దృష్టికి తీసుకురాగా రెండు రోజుల్లో అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉం చాలని వ్యవసాయశాఖ అధికారులన ఆదే శించారు. సచివాలయ సిబ్బంది హాజరుపట్టిక ను, రికార్డులను పరిశీలించారు. సమయ పా లన పాటించని వారిపై చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్యదర్శి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 12:23 AM