ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సకాలంలో విత్తనాలు అందించాలి

ABN, Publish Date - May 06 , 2025 | 11:58 PM

రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సకాలంలో వి త్తనాలు అందేలా చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్క ర్‌ అధికారులను ఆదేశిం చారు.

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌
  • సాగునీటి సరఫరాలో అంతరాయం ఉండకూడదు

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 6(ఆంధ్రజ్యోతి): రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సకాలంలో వి త్తనాలు అందేలా చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్క ర్‌ అధికారులను ఆదేశిం చారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సాగునీటి సరఫరా, విత్తనాల పంపిణీ వంటి అంశాలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాగునీటి సర ఫరాలో ఎటువంటి అంతరాయం ఉండరాదని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్‌ గ్రామ, వార్డు సచివాలయాల పరిశుభ్రత, సచివాలయ ఉద్యోగుల పనితీరు, మత్స్య, పశుసంవర్థక శాఖ ల పనితీరు, రహదారుల నిర్మాణం, భూవివా దాల పరిష్కారం, పాఠశాలల్లో మౌలిక వసతు లు, ఆసుపత్రులలో ఔషధాల లభ్యత వంటి అంశాలపై చర్చించారు. పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంరభిం చాలని సూచించారు. మత్స్యశాఖ చేపల పెంపకంపై, పశుసంవర్థక శాఖ పశువుల వ్యా క్సినేషన్‌ కార్డుల పంపిణీపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. విద్య, వైద్యారోగ్య శాఖల పనితీరుపై కలెక్టర్‌ ఆరా తీశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, తాగు నీరు, టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, ప్రభుత్వ వనరుల వినియోగంలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. పనుల్లో ఆలస్యానికి తావు ఇవ్వొద్దన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:58 PM