ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారుల పనులు వేగవంతం చేయాలి

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:55 PM

రహదారుల పనులు వేగవంతం చేయా లని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించా రు.

మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రహదారుల పనులు వేగవంతం చేయా లని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించా రు. శనివారం రాత్రి నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చెట్లతాండ్ర- డీజీ పురం, లఖందిడ్డి-మర్రిపాడు రోడ్లకు రూ.3.70కోట్లు, నౌపడా-డమర రోడ్డు 13 కిలోమీటర్లకు గాను రూ.6 కోట్లు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిధుల మంజూరులో జాప్యం ఉండదని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పాతజాతీయరహదారి నుంచి టెక్కలి వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు రోడ్డుకు రూ.3.5కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తికావాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ, డీఈఈలు రవికాంత్‌, తిరుపతిరావు ఉన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణలో తలెత్తిన లోపాలు సరిచేయాలని పలువురు నాయకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటిని గుర్తించి సంబంధిత డైరెక్టర్‌తో మంత్రి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Updated Date - Jun 21 , 2025 | 11:55 PM