సేవలకు పునాదిరాయిగా రెవెన్యూ శాఖ
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:49 PM
బ్రిటిష్ కాలం నుంచి రెవెన్యూ శాఖ.. సేవలకు పునాదిరాయిగా నిలిచిందని డీఆర్వో వెంకటేశ్వర రావు అన్నారు.
డీఆర్వో వెంకటేశ్వరరావు
ఘనంగా రెవెన్యూ డే
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 20(ఆంధ్రజ్యోతి): బ్రిటిష్ కాలం నుంచి రెవెన్యూ శాఖ.. సేవలకు పునాదిరాయిగా నిలిచిందని డీఆర్వో వెంకటేశ్వర రావు అన్నారు. రెవెన్యూ డే సందర్భంగా స్థానిక బాపూజీ కళామందిర్‌లో శుక్రవారం జిల్లా రెవెన్యూ ఉద్యోగులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భూ పరిపాలన నుంచి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ కీలకంగా నిలుస్తోందన్నారు. అలాగే రెవెన్యూ గెస్టు హౌస్ వద్ద జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు యూనియన్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, డిప్యూటీ కలెక్టర్ బి.పద్మావతి, ప్రతినిధులు ప్రవల్లిక, రాజు, చంద్రశేఖర్, లింగరాజు, ధర్మాన.ప్రకాష్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం, జూన్ 20(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డీటీ శ్రీహరి ఆధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ డే కార్యక్రమా న్ని నిర్వహిం చారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సోంపేట, జూన్ 20(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెనూ డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రిటైర్డు రెవెన్యూ ఉద్యోగి కుర్మనాథ్ పాణీగ్రాహీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీటీ మహేష్, ఆర్‌ఐ కిరణ్, సర్వేయర్ నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.
కవిటి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని డీటీ కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం కవిటి తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులను సత్కరించారు. సర్వేయర్ మల్లికార్జున పాణిగ్రాహి, వీఆర్వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
జి.సిగడాం, జూన్ 20(ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ ఎం.సరిత ఆధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ డే ఘనంగా నిర్వహించారు. కేక్‌ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో డీటీ నిర్మల, వీఆర్వో భూపతి నర్శింగరావు, రవికుమార్, సర్వేయర్, సిబ్బంది పాల్గోన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 11:49 PM