వినతులను తక్షణం పరిష్కరించాలి
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:45 PM
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత నిస్తూ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత నిస్తూ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యా దులు నమోదు, పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భం గా 56 మంది నుంచి ఫిర్యా దులు స్వీక రించి వారితో స్వయంగా మాట్లాడారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదు లపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమ యంలో జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదిక అందిం చాలని అధికారులకు ఆదేశించారు.
మసీదులోకి వాడుకనీరు వస్తోంది
జి.సిగడాం మండలం పాలఖండ్యాం గ్రామం లో ఉన్న మసీదులోకి ఎదురుగా ఉన్న ఓ ఇంటి నుంచి వాడుకనీరు నేరుగా మసీదులోకి వస్తోం దని 50 ముస్లిం కుటుంబాలు ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. వాడుకనీరు మసీదులోకి వస్తున్న విషయమై సదరు మహిళను నిలదీస్తే సదరు ఆమె మద్దతుదారు తమను వేధిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మహిళ ఇంటి నుంచి వాడుకనీరు బయటకు వెళ్లేందుకు ఒక పైపులైన్ ఏర్పాటు చేసినా ఆ పైపునకు వాడుకనీరు కనెక్షన్ ఇవ్వకుండా మసీదు వద్ద ఉన్న రోడ్డువైపు వాడుక నీరు వదిలివేస్తోందని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
Updated Date - Jul 21 , 2025 | 11:45 PM