ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cashew Industries: తెరచుకున్న జీడి పరిశ్రమలు

ABN, Publish Date - Jun 20 , 2025 | 11:42 PM

Cashew processing units.. Local economy పలాస-కాశీబుగ్గలో జీడి పరిశ్రమలు శుక్రవారం తెరుచుకున్నాయి. జీడిపప్పునకు మార్కెట్‌ లేకపోవడం, సరకులు పేరుకుపోవడం వంటి కారణాలతో జీడి పరిశ్రమలు 19 రోజులు బంద్‌ పాటించాయి.

పలాసలోని జీడి పిక్కలు పీలింగ్‌ చేస్తున్న మహిళా కార్మికులు
  • కార్మికుల్లో ఆనందం

  • పలాస, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గలో జీడి పరిశ్రమలు శుక్రవారం తెరుచుకున్నాయి. జీడిపప్పునకు మార్కెట్‌ లేకపోవడం, సరకులు పేరుకుపోవడం వంటి కారణాలతో జీడి పరిశ్రమలు 19 రోజులు బంద్‌ పాటించాయి. పరిశ్రమలు తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని కార్మికసంఘ నాయకులు ఆందోళన నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు యజమానులే అనుకున్న సమయానికి పరిశ్రమలు తెరవడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. జంట పట్టణాల్లో మొత్తం అన్నీ పరిశ్రమలు తెరిచి ఉపాధి కల్పిస్తున్నట్లు వ్యాపార సంఘ నాయకులు తెలిపారు. పలాస-కాశీబుగ్గలో మొత్తం 250కు పైగా జీడి పరిశ్రమలు ఉండగా 15వేల మందికిపైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 19 రోజుల పాటు పరిశ్రమలు బంద్‌ కావడంతో కార్మికులు వేతనాలు లేక ఇబ్బందులు పడ్డారు. కార్మిక సంఘ నాయకులు.. జీడి వ్యాపారులతో చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఇటీవల జీడి వ్యాపార సంఘ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కార్మికులు నిరసన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జీడి గింజలకు మార్కెట్‌ లేకపోవడంతో ఆ ప్రభావం పలాస జీడి మార్కెట్‌పై పడింది. పలాస జీడిపప్పు మన దేశంతో పాటు అరేబియాకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటుంది. జీడి పిక్కల ధరలు పెరగడం, పప్పు రేట్లు పతనం కావడంతో అప్పటికే టన్నుల కొద్ది జీడిపప్పు నిల్వలు వ్యాపారులు, బ్రోకర్ల వద్ద ఉండిపోయింది. ఈ నేపఽథ్యంలో సామూహికంగా బంద్‌ పాటిస్తే కొంతవరకూ ఉన్న సరుకులు అమ్ముడవుతాయని వ్యాపారులు భావించారు. అయితే కార్మికుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో శుక్రవారం పరిశ్రమలు తెరిచారు. జూలై, ఆగస్టు నెలల్లో జీడి పప్పునకు గిరాకీ ఉంటుందని వ్యాపారులు భావిస్తున్నారు. పరిశ్రమలు తెరవడంతో తమకు ఉపాధి దక్కిందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 20 , 2025 | 11:42 PM