కళాశాల స్థలం ఆక్రమణల తొలగింపు
ABN, Publish Date - Jul 11 , 2025 | 11:45 PM
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా స్థలం ఆక్రమించి గడ్డి కుప్పలు, కర్రలను ఓ వ్యక్తి ఉంచడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేసి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
జి.సిగడాం, జూలై 11(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా స్థలం ఆక్రమించి గడ్డి కుప్పలు, కర్రలను ఓ వ్యక్తి ఉంచడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేసి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కళాశాల ప్రిన్సి పాల్ ఫిర్యాదు మేరకు తహసీల్దార్ చరిత, ఎస్‌ఐ మధుసూదనరావు శుక్ర వారం సదరు స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని సర్వే చేసి హద్దులు నిర్ణయించి అప్పగిం చారు. అంతకు ముందు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.పవిత్ర, డి.చందు మాట్లాడుతూ.. జూనియర్ కళాశాలకు చెందిన 1.50 ఎకరాల ఆట స్థలాన్ని హరినాథ్ బాబా కబ్జా చేశారని, దీంతో స్థలంలేక విద్యార్థులు ఆడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణ ఆక్రమణ లను తొలగించాలని కోరారు.
Updated Date - Jul 11 , 2025 | 11:45 PM