మత సామరస్యాన్ని కాపాడుకోవాలి: ఎన్‌ఈఆర్
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:07 AM
మత సామరస్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) అన్నారు.
జి.సిగడాం, జూలై 14(ఆంధ్రజ్యోతి): మత సామరస్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) అన్నారు. డీఆర్ వలస శివాలయం ఆవరణలో నవగ్రహ విగ్రహాల ధ్వంసం ఘటనా ప్రదేశాన్ని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసా నంద సరస్వతితో కలిసి సోమవారం పరిశీలించా రు. ధర్మాన్ని కాపాడటానికి ప్రతీ ఒక్కరూ ముందు కు రావాలని కోరారు. దేవాల యాలపై ఇటువంటి ఘటనలను సాధుపరిషత్ ఖండిస్తుందని శ్రీనివా సానంద అన్నారు. కార్యక్రమంలో నాయ కులు కుమరాపు రవికుమార్, అప్పన్న, కూర్మారావు, ఆదినారాయణ జగన్నాథరావు పాల్గొన్నారు.
వెంకటేష్ కుటుంబానికి పరామర్శ
ఇటీవల తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పాశమైలం సిగాచి కంపెనీలో జరిగిన అగ్ని ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయిన పాలఖండ్యాం పంచాయతీ జగన్నాఽథపురానికి చెందిన గుండుబిల్లి వెంక టేష్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ పరామర్శించారు. ఈ ఘటనలో వెంకటేష్ మృతి చెందడం విషాదకరమని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ట్రాన్స్‌ఫార్మర్‌తో ఇబ్బందులు
మెట్టవలస పంచాయతీ పాల ఖండ్యాం కూడలి వద్ద నివాసాల మధ్య ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ఆయన తన మొబైల్‌లో ఆ ట్రాన్స్‌ఫార్మర్ ఫొటోను తీసి విద్యు త్ శాఖాధికారులకు పంపి తక్షణం దానిని వేరే చోటికి తరలించాలని సూచించారు.
Updated Date - Jul 15 , 2025 | 12:07 AM