వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:08 AM
రాష్ట్రంలో కూటమి ప్ర భుత్వం అభివృద్ధి, సం క్షేమం అజెండాగా సాగి స్తూ ప్రజల హృదయా ల్లోకి స్థానం పొందింద ని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, ఆమదాలవలస నియో జకవర్గ పరిశీలకులు, రాష్ట్ర ట్రేడ్ కార్పొ రేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు.
ఆమదాలవలస, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్ర భుత్వం అభివృద్ధి, సం క్షేమం అజెండాగా సాగి స్తూ ప్రజల హృదయా ల్లోకి స్థానం పొందింద ని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, ఆమదాలవలస నియో జకవర్గ పరిశీలకులు, రాష్ట్ర ట్రేడ్ కార్పొ రేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. గురువారం పట్టణంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వారు పాల్గొని మాట్లా డారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించేందు కు అసత్య ప్రచారాలు ప్రారంభించిందని, దీనిని ప్రతి టీడీపీ కార్యకర్త ఒక సైనికుడిలా గ్రామాల్లో పనిచేసి తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమదాలవలస మండల టీడీపీ అధ్యక్షుడిగా కనుగులవలస సర్పంచ్ నూక అప్పలసూరనాయుడుతో పాటు కార్యవర్గాన్ని ఎమ్మెల్యే పర్యవేక్షణలో ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, నారాయణపురం ఆనకట్టు చైర్మన్ సనపల ఢిల్లీశ్వరరావు, కళింగ కార్పొరేషన్ డెరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ బి.అప్పారావు, నాయకులు హనుమంతు బాలకృష్ణ, అన్నెపు భాస్కరరావు, తమ్మినేని అమర్‌నాఽథ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 04 , 2025 | 12:08 AM