రేషన్ పంపిణీ పక్కాగా చేపట్టాలి
ABN, Publish Date - May 28 , 2025 | 12:13 AM
చౌక ధరల దుకాణాల ద్వారా జూన్ ఒకటో తేదీ నుంచి నిత్యావసర సరుకులను కార్డుదారులకు పక్కాగా పంపిణీ చేయాలని ఆర్డీవో ఎం.కృష్ణ మూర్తి ఆదేశించారు.
టెక్కలి, మే 27(ఆంధ్రజ్యోతి): చౌక ధరల దుకాణాల ద్వారా జూన్ ఒకటో తేదీ నుంచి నిత్యావసర సరుకులను కార్డుదారులకు పక్కాగా పంపిణీ చేయాలని ఆర్డీవో ఎం.కృష్ణ మూర్తి ఆదేశించారు. సబ్ కలెక్టర్ కార్యాల యంలో మంగళవారం సీఎస్‌డీటీలతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఏఏ డిపోల నుంచి కార్డు దారులకు సరుకులు పంపిణీ చేస్తారో ఆ డిపోలను ముందుగా సీఎస్‌డీటీలు సంద ర్శించాలన్నారు. కార్డుదారులెంతమంది, సరు కుల నిల్వ, ఈ-పాస్ యంత్రం, తూనికలు, కొలతల సామగ్రి ఉన్నాయో లేదో చూడాల న్నారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 4 గంటల నుం చి రాత్రి 8 గంటల వరకు సరుకులు లబ్ధిదా రులకు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి సరుకులు అందజేయాలని, నిత్యావసర సరుకులు పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు. రెగ్యులర్, స్వయంశక్తి సంఘాల పరిధిలో ని డిపోలు, అలాగే కోర్టు కేసుల పరిధిలో ఉన్న డిపోలు గమనించి అవసరమైన చర్యలు తీసుకోవా లన్నారు. జూన్‌లో కార్డుకి అరకేజీ పంచదార, యూనిట్‌కు ఐదు కేజీల బియ్యం పంపిణీ చేయాలని, డీలర్లు నెలవారీ డీడీలు కట్టేలా చూడాలన్నారు. సమావేశంలో సీఎస్‌డీటీలు పాల్గొన్నారు.
Updated Date - May 28 , 2025 | 12:13 AM