సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - May 14 , 2025 | 12:19 AM
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎంఎన్ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఆర్‌కే రావు, అప్పయ్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 13(ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎంఎన్ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఆర్‌కే రావు, అప్పయ్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేశారు. రాష్ట్ర కార్యదర్శి కేవీఆర్ నరసింగరావు, తదితరులు మాట్లాడుతూ.. ఉద్యోగుల క్రమశిక్షణ చర్యల విషయంలో, అలాగే సిబ్బంది అనారోగ్య సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక సందర్భాల్లో సెలవులను మంజూరు చేయాలని, వారికి రెస్ట్ రూమ్స్, టాయిలెట్ సదుపాయం కల్పించాలని, రిటైర్డు ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పింఛన్ అమలు చేయాలని కోరారు. గ్యారేజీలు, వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఆన్‌కాల్, హైర్‌బస్సు డ్రైవర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, మరిన్ని కొత్త బస్సులు మంజూరు చేయాలని, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ డబ్బులు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1డిపో నాయకులు, 2డిపో నాయకులు, టెక్కలి, పలాస డిపో అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు.
Updated Date - May 14 , 2025 | 12:19 AM