ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Free education : పేదలకు ప్రైవేటు విద్య

ABN, Publish Date - Apr 30 , 2025 | 11:56 PM

Right to Education (RTE) పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచితంగా అడ్మిషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంఈవోలు ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఈ విషయం తెలియజేశారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని.. లేదంటే చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.

  • ప్రైవేటు స్కూళ్లలో 25శాతం సీట్లు ఉచితం

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

  • రణస్థలం, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచితంగా అడ్మిషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంఈవోలు ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఈ విషయం తెలియజేశారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని.. లేదంటే చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. అడ్మిషన్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నమోదును ఆహ్వానించారు. మే నెల 15 వరకూ దరఖాస్తుల నమోదు ప్రక్రియ కొనసాగనుంది. ఫస్ట్‌ రౌండ్‌లో లాటరీ ద్వారా ఎంపికైనవారి వివరాలు మే 21 నుంచి 24లోపు ప్రకటిస్తారు. జూన్‌ 2వ తేదీలోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. అలాగే రెండో రౌండ్‌లో ఎంపికైన జాబితాను జూన్‌ 6న ప్రకటించి.. జూన్‌ 12న అడ్మిషన్లు పూర్తి చేస్తారు. గత అనుభవాల దృష్ట్యా 25శాతం అడ్మిషన్ల ప్రక్రియ పక్కాగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారదర్శకత కోసం ఆరు అంచెల్లో నిర్ధారించిన తరువాత విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, బీసీ మైనార్టీ, అగ్రకులాల్లో పేదలను ప్రధాన పరిగణనగా తీసుకుంటారు. అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులకు 5 శాతం, షెడ్యూల్‌ కులాలకు 10 శాతం, ఎస్టీ పిల్లలకు 4 శాతం కేటాయిస్తారు. బీసీ, మైనార్టీ, ఓసీ గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంత కుటుంబాలకు రూ.1.44 లక్షలు మించకుండా ఉంటే 6 శాతం సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు.

  • ఇదీ పరిస్థితి..

    జిల్లాలో 292 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలల్లో అడ్మిషన్లలో 25 శాతం సీట్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలి. గడిచిన మూడేళ్లలో 1,612 మందికి సీట్లు ఇచ్చినట్టు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఆన్‌లైన్‌లో 3,089 మంది దరఖాస్తు చేసుకున్నారు. లాటరీ ద్వారా 1,554 మందిని ఎంపిక చేశారు. అందులో 1,127 మంది మాత్రమే అడ్మిషన్లు పొందినట్టు అధికారులు చెబుతున్నారు. గతంలో అడ్మిషన్ల విషయమై కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. కానీ విద్యాహక్కు చట్టం అమలు చేయాల్సిందేనని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. దీంతో 25 శాతం ఉచిత అడ్మిషన్ల విధానాన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో పక్కాగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. పేరుకే ఉచిత అడ్మిషన్లు అని.. తీరా పాఠశాలల్లో చేరాక ఫీజులు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. పుస్తకాలతోపాటు యూనిఫాం కొనుగోలు చేయాలని.. అడ్మిషన్‌, పరీక్ష ఫీజులంటూ గుంజేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల నుంచి ఫీజుల ఒత్తిడి లేకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

  • కచ్చితంగా పాటించాలి

    ప్రైవేటు పాఠశాలల్లో విధిగా 25శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. దీనిపై కోర్టు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చి తర్వాత ఫీజులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అలా చేసిన యాజమాన్యాలపై చర్యలు తప్పవు. కచ్చితంగా అన్ని పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే.

    - తిరుమల చైతన్య, డీఈవో, శ్రీకాకుళం

Updated Date - Apr 30 , 2025 | 11:56 PM