గిరిజన విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:14 AM
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థుల విద్యకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
హరిపురం, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థుల విద్యకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలం డబార్సింగి గ్రామంలో పీఎం జన్‌మాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.2.30 కోట్లతో కొత్తగా మంజూరైన పాఠశాల భవనానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు బావన దుర్యోధన ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గిరిజనుల అభివృధ్ధి కోసం ఐటీడీఏను దివంగత ఎన్టీఆర్ ఏర్పాటు చేస్తే సీఎం చంద్రబాబు మౌలిక వసతుల కల్పనేఽ ద్యేయంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆశ్రమ పాఠశాలలు బ్రష్టుపట్టాయని, గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా మంజూరైన పాఠశాలకు భవనం నిర్మించి ఏడాదిలో ప్రారంభిస్తామని చెప్పారు. దీనిని గిరిజన ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కిల్లోయి, బంజరి యువరాజపురం గ్రామాల్లో రైతులకు ఎరువుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆమెతో పాటు టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్, రట్టి లింగరాజు, దాసరి తాతారావు, మహేష్, మంగళి పాత్రో, తమిరి భాస్కరరావు, నవీన్, సాలిన మాధవరావు, డుంకూరు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:14 AM