ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:14 AM

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

రహదారిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కంచిలి, ఏప్రిల్‌ 29(ఆంరఽధజ్యోతి): గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. మంగళవారం పలు గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభం, కొత్త రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కంచిలి భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఆరు ట్రై సైకిళ్లతోపాటు సీపీ చైర్స్‌, వినికిడి యంత్రాలు అందించారు. మహిళలకు కోసం ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ ఇన్‌చార్జి దాసరి రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కంచిలిలో జూన్‌ ఒకటో తేదీ నుంచి పది రోజులపాటు నిర్వహించనున్న కంచమ్మ తల్లి సంబరాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సంబరాల కమిటీ, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఐ మంగరాజు, పాఠశాల ఎస్‌వో రజనీ కుమారి, ఎంపీడీవో వి.తిరుమలరావు, తహసీల్దార్‌ రమేష్‌ కుమార్‌, ఎస్‌ఐ పారినాయుడు, ఈడీ గడ్డమ్మ, ఎంఈవో పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:14 AM