ఇళ్లపట్టాల అర్హుల జాబితా సిద్ధం చేయండి
ABN, Publish Date - Jul 12 , 2025 | 11:40 PM
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలు అందిం చేందుకు అర్హులైన లబ్ధిదారుల జాబి తా సిద్ధం చేసి, స్థలాలను గుర్తిం చాలని వ్యవసాయశాఖ మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు.
కోటబొమ్మాళి, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలు అందిం చేందుకు అర్హులైన లబ్ధిదారుల జాబి తా సిద్ధం చేసి, స్థలాలను గుర్తిం చాలని వ్యవసాయశాఖ మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు అన్నారు. శని వారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో టెక్కలి, పలాస మం డలాల రెవెన్యూ అధికారులతో సమీ క్షించారు. ప్రస్తుతం నందిగాం మండ లంలో ఉన్న గృహ నిర్మాణ లే అవుట్లలో ఎంత మంది లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకున్నారు.. ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారు ఎంతమంది అని సం బంధిత అధికారులను ప్రశ్నించారు. మండలం లోని లే అవుట్‌లో 1453 మందికి పట్టాలు ఇవ్వగా, 236 మంది లబ్ధి దారులు ఇళ్లు నిర్మించుకున్నారని, మిగిలిన 1217 మంది ఇళ్ల నిర్మాణం చేపట్టక పోవడంతో స్థలాలు ఖాళీగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. సమీక్షలో టెక్కలి, పలాస ఆర్డీవోలు ఎం.కృష్ణమూర్తి, వెంకటేష్, రెవెన్యూ అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే నిమ్మాడలో మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించి జిల్లా నలు మూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు స్వీక రించారు. వినతులను పరిశీలించి సంబంధిత అధి కారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 11:40 PM