సమస్యలు తెలుసుకునేందుకే ప్రజాదర్బార్
ABN, Publish Date - May 24 , 2025 | 12:08 AM
సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బా ర్ నిర్వహిస్తున్నట్టు ఎమ్మె ల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నా రు.
పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, మే 23 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బా ర్ నిర్వహిస్తున్నట్టు ఎమ్మె ల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నా రు. పట్టణంలో టీడీపీ కా ర్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్య క్రమా న్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, టీడీపీ నాయకులు మొదలవలస రమేష్, సనపల ఢిల్లీశ్వరరావు, నూకరాజు, అంబళ్ల రాంబాబు, బలగ శంకర్ భాస్కరరావు, అన్నెపు రాము పాల్గొన్నారు. ఇదిలావుంటే విశాఖపట్నం, మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రజల్లో భయాం దోళన మొదలైంది. ఈ క్రమంలో కూన రవికుమార్, టీడీపీ అధికార ప్రతినిధి మొదల వలస రమేష్ మాస్క్‌లు ధరించి ప్రజల మధ్యకు వచ్చారు. ప్రస్తుతం కరోనా మళ్లీ వ్యాపి స్తున్నట్టు వస్తున్న ప్రచారం కంటే మాస్క్‌ల వాడకంపై ప్రచారం చేయాల్సిన అవసర ఉందని, అందుకే ప్రజాదర్బార్‌కు మాస్క్‌లు ధరించి వచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
Updated Date - May 24 , 2025 | 12:08 AM