ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:58 PM

పాలిసెట్‌ -2025 వెబ్‌ కౌన్సెలింగ్‌ శనివారం ప్రారంభమైంది.

కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు

తొలిరోజు 324 మంది హాజరు

ఎచ్చెర్ల, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): పాలిసెట్‌ -2025 వెబ్‌ కౌన్సెలింగ్‌ శనివారం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల (శ్రీకాకుళం)లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. తొలిరోజు 1 నుంచి 15వేల వరకు ర్యాంకు వచ్చిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలవగా 324 మంది హాజరయ్యారు. వీరి సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. ఇందులో ఓసీ, బీసీ విద్యార్థులు 312 మంది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 12 మంది ఉన్నారు. రెండో రోజు ఆదివారం 15,001 నుంచి 32వేల వరకు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసుకున్న విద్యార్థులు ఈ నెల 25వ తేదీ నుంచి కళాశాలలు, బ్రాంచ్‌ల ఎంపికకు ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ కె.నారాయణరావు, సీనియర్‌ అధ్యాపకులు మురళీకృష్ణ పర్యవేక్షణలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 11:58 PM