ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Teachers transport: ఉపాధ్యాయుల బదిలీల్లో.. పాయింట్లే కీలకం

ABN, First Publish Date - 2025-05-28T00:12:10+05:30

Points-based transfers ఉపాధ్యాయుల బదిలీల్లో వారికి కేటాయిస్తున్న ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్లు ఎంతో కీలకం. కోరుకున్న స్థానాలు దక్కించుకోవాలంటే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. న్యాయబద్ధంగా రావాల్సిన పాయింట్ల కోసం రాజీ పడకుండా ప్రయత్నించడంతో పాటు ఇతరులు అక్రమంగా పొందకుండా అడ్డుకోవాలి. లేదంటే స్థానాలు పొందే విషయంలో అన్యాయం జరగడం ఖాయం.

  • అప్రమత్తంగా లేకుంటే అర్హులకు అన్యాయమే

  • ముగిసిన దరఖాస్తుల గడువు

  • స్పౌజ్‌లో అదనపు పాయింట్ల కోసం కక్కుర్తి

  • గ్రేడ్‌-2 హెచ్‌ఎంల పదోన్నతి ప్రక్రియ ప్రారంభం

  • నరసన్నపేట, మే 27(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల్లో వారికి కేటాయిస్తున్న ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్లు ఎంతో కీలకం. కోరుకున్న స్థానాలు దక్కించుకోవాలంటే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. న్యాయబద్ధంగా రావాల్సిన పాయింట్ల కోసం రాజీ పడకుండా ప్రయత్నించడంతో పాటు ఇతరులు అక్రమంగా పొందకుండా అడ్డుకోవాలి. లేదంటే స్థానాలు పొందే విషయంలో అన్యాయం జరగడం ఖాయం. కొంతమంది అర్హత లేకపోయినా.. పాయింట్ల కోసం తమకు వర్తించని అంశాలను దరఖాస్తులో పొందుపర్చి ప్రయతిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు మాజీ సైనికోద్యోగులు.. ఉపాధ్యాయులుగా పనిచేస్తుంటే వారికి ఐదు పాయింట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం సైనికోద్యోగులుగా పనిచేస్తున్న వారి స్పౌజ్‌కు ఐదు పాయింట్లు కేటాయిస్తారు. మాజీ సైనికోద్యోగుల స్పౌజ్‌కు మాత్రం ఎటువంటి పాయింట్లు రావు. కానీ 2017 బదిలీల్లో స్పౌజ్‌లో వినియోగించుకున్న కారణంగా.. ఈ బదిలీల్లో కూడా ఒక ఉపాధ్యాయురాలు ఐదు పాయింట్లు పొందారు. కానీ దరఖాస్తు పరిశీలన సమయంలో ప్రస్తుతం భర్త పదవీవిరమణ పొందినట్లు తెలియడంతో ఎంఈవోలు వీటిని తొలగిస్తున్నారు.

  • స్పౌజ్‌ల విషయంలో తిరకాసు

  • జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు బదిలీల్లో స్పౌజ్‌ల విషయంలో తిరకాసు జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఈ పాయింట్ల కోసం ఎటువంటి సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేసే అవసరం లేకపోవడంతో కొందరు దరఖాస్తు సమయంలో స్పౌజ్‌ పొందారని తెలుస్తోంది. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఈ ఎనిమిదేళ్ల సమయంలో బదిలీల్లో ఒక్కరే స్పౌజ్‌ను వినియోగించాలి. కానీ కొందరు ఉద్యోగులు2023 బదిలీల్లో ఒకరు, ఈ బదిలీల్లో మరొకరు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం భార్యాభర్తలిద్దరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వరంగ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థలు, ప్రభుత్వ విద్యారంగ సొసైటీల్లో పనిచేసేవారికి మాత్రమే స్పౌజ్‌ పాయింట్లు కేటాయించనున్నారు. అయితే కొందరు అర్హత లేకపోయినా స్పౌజ్‌ పాయింట్లు పొందేందుకు దరఖాస్తులు చేసుకున్నారని సమాచారం. నిబంధనలు మేరకు 5/8 సంవత్సరాలు పూర్తయిన హెచ్‌ఎంలు, టీచర్ల మాత్రమే వినియోగించుకోవాలి. కానీ కొందరు ఆ సమయం పూర్తికాకపోయినా వినియోగించుకున్నారన్న ఆరోపణలున్నాయి. దరఖాస్తుల పరిశీలన పక్కాగా నిర్వహించి అక్రమార్కులను ఏరివేసి తమకు న్యాయం చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

  • ముగిసిన ఎస్జీటీ దరఖాస్తుల ప్రక్రియ

  • ఉమ్మడి జిల్లాలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ బదిలీలకు చెందిన దరఖాస్తు పక్రియ ముగిసింది. మంగళవారం నాటికే తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు దరఖాస్తులు ఎమ్మార్సీ కార్యాలయాల్లో ఎంఈవోలు బృందం పరిశీలించి తుది పరిశీలనకు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించేసారు. ఎస్జీటీలు సుమారు 3,700 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. దరఖాస్తులను రెండో విడతగా జిల్లాలో పరిశీలన చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో ప్రాథమిక సీనియార్టీ జాబితాను ఉంచనున్నారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మూడు సాంకేతిక బృందాలు పరిశీలిస్తాయి. తర్వాత తుది సీనియార్టీ జాబితాను విడుదల చేస్తారు.

  • హెచ్‌ఎంల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన

  • శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో.. మంగళవారం ఎస్‌ఏల నుంచి గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా పదోన్నతికి అర్హులైన ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 82 మంది వరకు గ్రేడ్‌-2 హెచ్‌ఎంలగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. గ్రేడ్‌-2 హెచ్‌ఎంల బదిలీ పక్రియ పూర్తయిన తరువాత ఉన్న ఖాళీలు ఆధారంగా పదోన్నతి పొందిన ఎస్‌ఏలకు గ్రేడ్‌-2 హెచ్‌ఎంలగా నియమాక పత్రాలను అందజేస్తారు.

  • ఫిర్యాదుల పరిష్కారానికి..

  • ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన ప్రాథమిక సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారానికి సాంకేతిపరంగా మూడు బృందాలను ఏర్పాటు చేశామని డీఈవో సదాశివుని తిరుమలచైతన్య తెలిపారు. ఎంఈవోల నుంచి వచ్చిన దరఖాస్తులను పునఃపరిశీలన కోసం టెక్కలి, పలాస, శ్రీకాకుళం, పాలకొండ రెవెన్యూ డివిజన్‌ వారీగా కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. స్పౌజ్‌, ప్రత్యేక కేటగిరి చెందిన దరఖాస్తులను పరిశీలన చేసేందుకు మరో మూడు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు, ప్రాథమిక సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించామన్నారు. ఆన్‌లైన్‌లో తుది సీనియార్టీ జాబితాను పొందుపరిచామని డీఈవో తెలిపారు.

Updated Date - 2025-05-28T00:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising