88 గ్రామాల్లో ‘పీఎంజుగా’ సర్వే
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:02 AM
సీతం పేట ఐటీడీఏ పరిధిలోని రెండు జిల్లాల పరిధి లో 88 గిరిజన గ్రామాల్లో పీఎంజుగా సర్వే చేపడుతున్నామని, ఈ సర్వే గిరిజనుల సమ స్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుందని ఏపీవో జి.చిన్నబాబు అన్నారు.
కొత్తూరు, జూన్ 20(ఆంధ్రజ్యోతి): సీతం పేట ఐటీడీఏ పరిధిలోని రెండు జిల్లాల పరిధి లో 88 గిరిజన గ్రామాల్లో పీఎంజుగా సర్వే చేపడుతున్నామని, ఈ సర్వే గిరిజనుల సమ స్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుందని ఏపీవో జి.చిన్నబాబు అన్నారు. శుక్రవారం అల్తి పంచాయతీ తామరగూడలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాలో 54, శ్రీకాకుళం జిల్లాలో 34 గిరిజన గ్రామాలను ఈ సర్వేకు ఎంపిక చేశారన్నారు. గ్రామాల్లో సర్వే చేపట్టి సమస్యలను గుర్తించడం ద్వారా వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దన్నారు. ప్రభుత్వ పథకాలు సజావుగా పొందేందుకు ఈ సర్వే ప్రామాణి కంగా మారనుందన్నారు. ఇంటింటికీ వెళ్లి వివిధ అంశాలపై సర్వే చేపడతారని, ప్రతి ఒక్కరు సర్వేకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ అన్నదొర, ఎంపీ డీవో వి.నీరజ తదితరులు పాల్గొన్నారు.
సులభతరంగా బోధించాలి
పాతపట్నం, జూన్ 20(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సులభతరంగా బోధన చేప ట్టాలని ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు అన్నా రు. ఎస్‌ఎస్‌మణుగులోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తొమ్మిది, పది తరగతుల విద్యార్థులతో మాట్లాడుతూ బోఽధ నపై ఆరా తీశారు. భోజన నిర్వహణ, పరిస రాల పరిశుభ్రతలను పరిశీలించారు. మెనూ నిర్వ హణలో వైఫల్యాలు ఉండకూడదని, పరిసరాలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిం చాలని హెచ్‌ఎం తర్ర అబ్బాయికి సూచిం చారు. కార్యక్రమంలో వార్డెన్ జీవనరావు, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 12:02 AM