చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:29 PM
నగరంలోని బాకర్‌సాహెచ్‌పేటకు చెందిన గుజ్జల రామయ్య (51) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శ్రీకాకుళం క్రైం, జూలై 26(ఆంధ్రజ్యోతి): నగరంలోని బాకర్‌సాహెచ్‌పేటకు చెందిన గుజ్జల రామయ్య (51) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామయ్య వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తు న్నాడు. శుక్రవారం తన ఇంటి మేడ మెట్లు దిగుతూ జారి పడిపోయాడు. నగరంలోని ఓ వస్త్రదుకాణంలో పనిచేస్తున్న రామయ్య భార్యకు స్థానికులు సమాచారమిచ్చింది. వెంటనే ఆమె వచ్చి దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొని వెళ్లి చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం రామయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్య హేమ ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం టూ టౌన్ ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 11:29 PM