క్వారీల నిర్వహణకు అనుమతులు తప్పనిసరి
ABN, Publish Date - May 19 , 2025 | 12:04 AM
గ్రానైట్, రోడ్డు మెటల్ క్వారీల నిర్వహ రణకు అన్ని రకాల అనుమతులు తప్పనిసరని ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి అన్నారు.
టెక్కలి, మే 18(ఆంధ్రజ్యోతి): గ్రానైట్, రోడ్డు మెటల్ క్వారీల నిర్వహ రణకు అన్ని రకాల అనుమతులు తప్పనిసరని ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గనులు, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మెళియాపుట్టి మండలంలో క్వారీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పేలుళ్లు జరిగిన క్వారీకి పలు రకాల అనుమతులు లేనట్లు గుర్తించామన్నారు. గ్రానైట్ క్వారీ నిర్వహణకు రెవెన్యూ, పంచాయతీ, పర్యావరణ, బ్లాస్టింగ్ అనుమతులు ఉండాలన్నారు. ఆయా గ్రానైట్ క్వారీలు అన్ని అనుమతులు చూపే వరకు ఎటువంటి పనులు చేయ వద్దని, నిలుపుదల చేయాలన్నారు. రెవెన్యూ, పోలీస్, మైన్స్, పంచాయతీ అధికారులు నేరుగా క్వారీలకు వచ్చి ఆయా రకాల అనుమతులు పరిశీలిం చిన తరువాత అన్నీ సక్రమంగా ఉంటేనే క్వారీల నిర్వహణకు అనుమతులు ఇవ్వ డం జరుగుతుందన్నారు. సమావేశంలో ఏఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు, సీఐలు విజయ్ కుమార్, రామారావు, గ్రానైట్ క్వారీల యజ మానులు దొడ్ల మహేష్, హరికుమార్, అల్లు నగేష్, పాండ్యన్, తహశీసీల్దార్లు రవికుమార్, అప్పలరాజు, మైన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2025 | 12:04 AM