ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

parents meeting: పిల్లల భవిష్యత్‌ నిర్మాణంలో తల్లిదండ్రులదీ కీలకపాత్ర

ABN, Publish Date - Jul 11 , 2025 | 12:02 AM

Parental Responsibility పిల్లల భవిష్యత్‌ నిర్మాణంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా కీలక భాగస్వాములు కావాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పిలుపునిచ్చారు.

విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
  • నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్‌ భారత్‌ సాధ్యం

  • పేరెంట్స్‌- టీచర్స్‌ మీటింగ్‌.. విద్యావ్యవస్థలో సరికొత్త చరిత్ర

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

  • అరసవల్లి, జూలై 10(ఆంధ్రజ్యోతి): పిల్లల భవిష్యత్‌ నిర్మాణంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా కీలక భాగస్వాములు కావాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ప్రత్యేకం. గార పాఠశాలలో మా నాన్న, ప్రభుత్వ మహిళా కళాశాలలో మా అమ్మ చదువుకున్నారు. ఈ రెండు విద్యాలయాలను నేడు సందర్శించడం ఎంతో ఆనందంగా ఉంది. విద్యార్థుల భవిష్యత్‌ కోసం కెరీర్‌ కౌన్సిలింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కారాదు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం ఉంటే మంచి విజయాలు సాధించవచ్చు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారానే వికసిత్‌ ఆంధ్ర, స్వర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ దిశగా మంత్రి లోకేశ్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిల్లల కోసం తల్లిదండ్రులు సమయాన్ని వెచ్చించి.. నాణ్యమైన విద్యనందించాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ విద్యార్థీ ఒక మొక్కను నాటి సంరక్షించాల’ని తెలిపారు. ‘ఏడాదిలోగా కళాశాలలో సమస్యలను పరిష్కరించి.. అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఆర్వో ప్లాంటు ప్రారంభిస్తాం. ప్రతీ కళాశాలకు ఒక క్రీడా మైదానం ఉండేలా చర్యలు తీసుకుంటామ’ని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

  • ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి

  • ‘వైసీపీ పాలనలో ప్రభుత్వ విద్య సర్వనాశనమైంది. కూటమి వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 15శాతం వరకు అడ్మిషన్లు పెరిగాయ’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘సులభమైన పదాలతో నూతన సిలబస్‌ను తయారు చేసి విద్యార్థులకు అందించాం. ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు, బ్యాగులు, కిట్లు అందజేశాం. గత ప్రభుత్వం పుస్తకాలు, బ్యాగులపై ఫొటోలను ముద్రించి పబ్లిసిటీ కోసం వాడుకుంది. మేం అందుకు పూర్తి భిన్నం. ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులందరికీ ‘తల్లికి వందనం’ పథకం అమలుచేశాం. ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కట్టుబడి ఉంద’ని తెలిపారు.

  • ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ ‘పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు. తల్లిదండ్రులు-ఉపాఽధ్యాయులు-విద్యార్థుల మధ్య సమన్వయం అనేది ఒక కొత్త చరిత్రకు నాంది. గొప్ప సమాజ నిర్మాణానికి ముందడుగు’ అని తెలిపారు.

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ ‘పిల్లలు డ్రగ్స్‌, గంజాయి. చెడు స్నేహాలు, సోషల్‌ మీడియా బారిన పడి జీవితాలను నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న వయసులో పెళ్లిళ్లు, గర్భధారణ చాలా అనర్థాలకు దారి తీస్తుంది. ఈ విషయాలపై అప్రమత్తంగగా ఉండాల’ని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడల పోటీలు నిర్వహించారు. బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేశారు. కోలాటం, సాంస్కృతిక నృత్యప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీఎంజే బాబు, మాదారపు వెంకటేష్‌, కొమ్మనాపల్లి వెంకటరామరాజు, కవ్వాడి సుశీల, అరవల రవీంద్ర, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 12:02 AM