ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

5 నుంచి పాంచరాత్రి కల్యాణ మహోత్సవాలు

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:05 AM

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో గల శ్రీముఖలింగేశ్వరస్వామి పాంచరాత్రి కల్యాణ మహోత్సవాలు ఈనెల 5వ తేదీ గురువారం నుంచి 11వ తేదీ బుధవారం వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు.

శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం
  • శ్రీముఖలింగంలో ఏర్పాట్లు

  • చివరి రోజున స్వామివారి చక్రతీర్థ స్నానం

జలుమూరు, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి) దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో గల శ్రీముఖలింగేశ్వరస్వామి పాంచరాత్రి కల్యాణ మహోత్సవాలు ఈనెల 5వ తేదీ గురువారం నుంచి 11వ తేదీ బుధవారం వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. 5న గురువారం రాత్రి ధ్వజారోహణ, అష్టదిక్పాలకులకు ఆహ్వానం, 6న స్వామివారి కల్యాణం, నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల గ్రామోత్సవం ఉంటుందన్నారు. 7న శనివారం ఆలయ ప్రాంగణంలో అన్నసంతర్పణ కార్యక్రమం, 8న ఆదివారం పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు, 9న సోమవారం సదస్య మహోత్సవం, 10న మంగళవారం దొంగవల్లి, 11న బుధవారం వంశధార నదిలో పార్వతీ పరమేశ్వరుల చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

Updated Date - Jun 03 , 2025 | 12:05 AM