'Pallenidra' సమస్యలు తెలుసుకునేందుకే ‘పల్లెనిద్ర’: ఎంజీఆర్
ABN, Publish Date - Apr 24 , 2025 | 12:25 AM
'Pallenidra' మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమం చేపడుతున్నామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
హిరమండలం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమం చేపడుతున్నామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. బుధవారం మర్రిగూడ గ్రామంలో పల్లెనిద్ర చేశారు. ఆశ్రమ పాఠశాల ఆవర ణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉయ్యక సురేష్, వైస్ ఎంపీపీ వైకుంఠరావు, పలువురు గ్రామస్థులు గ్రామం లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు మండల కేంద్రంలో గిరిజన భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఐటీడీఏ ఏర్పాటు చేస్తే అధికారులకు సమస్యలు తెలియజేసేందుకు వీలుం టుందని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళీప్రసాదరావు, తహసీ ల్దార్ హనుమంతరావు, టీడీపీ మండల నేతలు యాళ్ల నాగేశ్వ రరావు, టి.తిరుపతిరావు, నందిగాం సాయి కృష్ణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో యాత్రీకులపై జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 12:25 AM