‘పీ-4’ వేగవంతం చేయాలి
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:13 AM
జిల్లాలో ప్రభుత్వ-ప్రైవేటు- ప్రజల భాగస్వామ్యం(పీ-4) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ-ప్రైవేటు- ప్రజల భాగస్వామ్యం(పీ-4) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.బంగారు కుటుంబా లను మార్గదర్శులతో అనుసంఽధానంచేసే ప్రక్రియపై దృష్టిసారించాలని కో రారు. గురువారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడి యోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీ-4 కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోం దని, ఆగస్టు 15 నాటికి 15లక్షల కుటుంబాలను మార్గదర్శులకు అనుసం ధానంచేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు.లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.ప్రతీవారం ప్రధానకార్యదర్శి ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 3000 కుటుంబాలను మార్గదర్శులకు అనుసంధానించాలన్నారు. వీడియో కాన్ఫ రెన్స్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, పలు శాఖల అఽధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 11 , 2025 | 12:13 AM