ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అరాచక పాలన అంతమొంది ఏడాది

ABN, Publish Date - Jun 04 , 2025 | 11:58 PM

వైసీపీ అరాచక, రాక్షస పాలన అంతమై ఏడాదై.. రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమయిందని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ అన్నారు.

ఆమదాలవలస: బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్న టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు

శ్రీకాకుళం అర్బన్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అరాచక, రాక్షస పాలన అంతమై ఏడాదై.. రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమయిందని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ అన్నారు. బుధవారం నగరంలోని ఎన్‌టీఆర్‌ మునిసిపల్‌ మైదానంలో మహిళలకు, జనసేన పార్టీ వీరమహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ పరిపాలనలో ప్రజలు పూర్తిగా విసిగివేసారిపోయి చిత్తుగా ఓడించారన్నారు. ఇటువంటి రోజు ను ప్రజలు పండగలా చేసుకోవాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్దపుడి విజయ్‌కుమార్‌, దానేటి శ్రీధర్‌, మజ్జి భాస్కర్‌, కొండా వర ప్రసాద్‌, రావాడ కామేష్‌, పలువురు వీర మహిళలు పాల్గొన్నారు.

రాక్షస పాలనకు విముక్తి దినం

ఆమదాలవలస, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రాక్షస పాలనకు విముక్తి కలిగి సుపరిపాలనకు ఏడాది పూర్తయిందని జనసేన పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్‌రావు అన్నారు. బుధవారం పట్టణం లోని వన్‌వే జంక్షన్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పిలుపు మేరకు దీపావళి పండగ జరుపుకున్నా మన్నారు. గత వైసీపీ అరాచక పాలన ముగిసి ఏడాది పూర్తయిందని, కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సంద ర్భంగా బాణసంచా కాల్చి సందడి చేశారు. అలాగే స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేత లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయ కులు పేడాడ సూరపునాయుడు, సనపల ఢిల్లీశ్వరరావు, పైడి మురళీ మోహన్‌, నేతింటి జ్యోతి, నాగళ్ల మురళీధర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

‘వైసీసీ పీడ విరగడై..’

టెక్కలి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌ పీడ విరగడై ఏడాది అయినంటూ జనసేన పార్టీ నేతలు బుధ వారం సంబరాలు నిర్వహించారు. బుధవారం రాత్రి జనసేన కార్యా లయం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి సందడి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలనకు కూడా ఏడాదైందని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కణితి కిరణ్‌కుమార్‌ అన్నారు. జగన్‌ ముఠా ఐదే ళ్ల పాటు దోపిడీలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజలు వారికి బుద్ధి చెప్పినా ఇప్పటికీ వారికి జ్ఞానోదయం కలగలేదన్నారు. కార్యక్ర మంలో జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఇది మంచి ప్రభుత్వం

రణస్థలం, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి విష్వ క్సేన్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సంద ర్భంగా దేరసాం, పైడిభీమవరం, బొంతు వలస గ్రామాల్లో రంగ వల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వడ్డాది శ్రీనివాస రావు, దన్నాన రవీంద్ర, బొంతు విజయ్‌ కృష్ణ, బసవ గోవిందరెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో సుపరిపాలన

ఇచ్ఛాపురం, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మంచి సుపరిపాలన అందించిందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు అన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం పార్టీ నాయకులు, కార్యక ర్తలతో కలిసి వేడుకలు నిర్వహించారు. వీకే పేట జంక్షన్‌ వద్ద పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ జంక్షన్‌కు ర్యాలీగా చేరుకుని వీర మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తిప్పన దుర్యోధనరెడ్డి, డొక్కరి ఈశ్వరి శారద, డి.శేఖర్‌, ఆర్‌.భాస్కర్‌, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:00 AM