తెప్పలవలసలో ఒకరు ఆత్మహత్య
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:32 AM
తెప్పలవలస గ్రామానికి చెందిన ఎం.చి న్నారావు (45)గురువారం ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.
రణస్థలం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): తెప్పలవలస గ్రామానికి చెందిన ఎం.చి న్నారావు (45)గురువారం ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. జేఆర్‌పురం పోలీసుల కథనం మేరకు.. చిన్నారావుకు అప్పులు ఎక్కువకావడంతో గురువారం మధ్యా హ్నం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ చిన్నారావు మృతిచెందాడు. చిన్నారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కళావతి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపారు.
Updated Date - Jul 11 , 2025 | 12:32 AM