హత్యాయత్నం కేసులో ఒకరి అరెస్టు
ABN, Publish Date - Apr 28 , 2025 | 11:56 PM
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమడాం గ్రామానికి చెందిన గుండు ఆదినారాయణను హత్యాయత్నం కేసులో సోమవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ జి.లక్షణరావు తెలిపారు.
లావేరు, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమడాం గ్రామానికి చెందిన గుండు ఆదినారాయణను హత్యాయత్నం కేసులో సోమవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ జి.లక్షణరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 26వ తేదీ రాత్రి ఆదినారాయణతో పాటు నాగంపాలెం గ్రామానికి చెందిన కెల్ల సత్యనారా యణ, రామారావు కలిసి రావాడ జంక్షన్‌లో మద్యం తాగారు. అనంతరం ఆటోతో తమ ఇళ్లకు చేరే సమయంలో సత్యనారాయణపై ఆదినారాయణ చాకుతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరిని విడిపించేందుకు ప్రయత్నంచిన కెల్ల రామారావును చాకుత్ గాయపరిచాడు. వీరిరువురి మధ్య గతంలో ఉన్న పాతకక్షలే కారణమని ఎస్‌ఐ తెలిపారు. సత్యనారాయణ, రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదినారాయణపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Updated Date - Apr 28 , 2025 | 11:56 PM