ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఐక్యతకు ప్రతీక ఒలింపిక్‌ డే రన్‌

ABN, Publish Date - Jun 23 , 2025 | 12:11 AM

ప్రపంచ దేశాల మధ్య ఐక్యతకు ప్రతీకగా ఒలింపిక్‌ డే రన్‌ నిలుస్తుందని ఒలింపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు ధ ర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

ర్యాలీగా వెళ్తున్న క్రీడాకారులు, అధికారులు
  • ఒలింపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్‌

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాల మధ్య ఐక్యతకు ప్రతీకగా ఒలింపిక్‌ డే రన్‌ నిలుస్తుందని ఒలింపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు ధ ర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఒలింపిక్‌ డే సందర్భంగా ఆదివారం నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్‌ నుంచి ఏడు రోడ్ల కూడలి మీదుగా కోడి రామ్మూర్తి స్టేడియం వరకు క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు క్రీడాజ్యోతితో రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడాకారుడిగా రాణించాలంటే క్రమశిక్షణ అవసరమన్నారు. క్రీడల ద్వారా ఏకాగ్రత ఏర్పడుతుందని తద్వారా బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చ న్నారు. ఏటా జూన్‌ 23వ తేదీన ఒలింపిక్‌ డే రన్‌ నిర్వహిస్తారని, ఇది మ నమంతా ముందురోజు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. అంతకుముందు క్రీడాజ్యోతిని మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతి, కృష్ణదాస్‌ వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలిపింక్‌ సంఘం కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సభ్యులు ఎండీ ఖాసీమ్‌ఖాన్‌, పి.సుందరరావు, ప్రసాద్‌, టి.మధుసూదనరావు, చిట్టి నాగభూషణరావు, డీఎస్‌డీవో కె.శ్రీధర్‌ వ్యాయామ ఉపాధ్యాయులు ఎంవీ రమణ, బీవీ రమణ, కె.మాధవరావు, సీహెచ్‌ జగదీష్‌, పురుషోత్తం, ఎన్‌వీ రమణ, వివిధ సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 12:11 AM