ఆఫ్‌షోర్ నిర్వాసితుల బైక్ ర్యాలీ
ABN, Publish Date - Jun 01 , 2025 | 11:54 PM
ఆఫ్‌షోర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, అప్పటి వరకు పొరాటం సాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు.
మెళియాపుట్టి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ఆఫ్‌షోర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, అప్పటి వరకు పొరాటం సాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. ఆదివారం చీపురుపల్లి, దాసుపు రం గ్రామాల్లో నిర్వాసితులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు గడుస్తున్నా ఇంకా చాలామంది నిర్వాసితులకు నష్టపరిహారం అందించలేదన్నారు. సర్వే చేసిన సమయంలో 132 మందిని తప్పించారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింహాచలం, సర్పంచ్ ఈశ్వరరావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 01 , 2025 | 11:54 PM