ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒడిశా టూ.. ముంబై

ABN, Publish Date - Jul 30 , 2025 | 12:16 AM

ఒడిశా నుంచి గంజాయిని ముంబై తరలిస్తుం డగా ఇచ్ఛాపురంలో ఓ వ్యక్తి అరెస్ట య్యాడు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ చిన్నంనాయుడు
  • ఇచ్ఛాపురంలో 34.3 కిలోల గంజాయి స్వాధీనం

ఇచ్ఛాపురం, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి గంజాయిని ముంబై తరలిస్తుం డగా ఇచ్ఛాపురంలో ఓ వ్యక్తి అరెస్ట య్యాడు. ఈ మేరకు పోలీసులు 34.3 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళ వారం ఇచ్ఛాపురంలోని సర్కిల్‌ కార్యాలయంలో సీఐ మీసాల చిన్నంనాయుడు పట్టణ ఎస్‌ఐ ముకుంద రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఐ కథనం మేరకు.. ఒడిశాలోని గంజాం జిల్లా ఖరియాగూడ ప్రాంతానికి చెందిన సంతు న్‌ దాసు రైతుల వద్ద 34.3 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. దాన్ని ముంబై లోని మలాద్‌ ప్రాం తంలో ఉంటున్న లొబొకుండ అనే వ్యక్తికి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఒడిశా నుంచి ద్విచక్ర వాహనంపై ఇచ్ఛాపురం చే రుకున్నాడు. గంజా యి తరలిస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ ముకుందరావుకు సమాచా రం అందింది. దీంతో ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ రెండో ఫ్లాట్‌ ఫారం, ఎల్‌సీ గేటు వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో రెండు లగేజీ బ్యాగులతో 18 గంజా యి ప్యాకెట్లతో బైక్‌పై సంతున్‌ దాసు వస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. గంజాయిని సీజ్‌ చేసి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:16 AM