ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ganjayi Ravana ఒడిశా టు చెన్నై

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:32 AM

Ganjayi Ravana మందస రోడ్‌(హరిపురం) రైల్వే స్టేషన్‌ పరిధిలో 4 కిలోల గంజాయిని తరలిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడిని బుధ వారం రాత్రి అరెస్ట్‌ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు.

హరిపురం: మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటఅప్పారావు

4 కిలోల గంజాయితో యువకుడి అరెస్ట్‌

హరిపురం మార్చి13 (ఆంధ్ర జ్యోతి): మందస రోడ్‌(హరిపురం) రైల్వే స్టేషన్‌ పరిధిలో 4 కిలోల గంజాయిని తరలిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడిని బుధ వారం రాత్రి అరెస్ట్‌ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాహుల్‌ మొండల్‌ చెన్నైలో టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. డబ్బుపై ఆశతో గంజాయి రవాణాకు చెన్నైకి చెందిన రంజిత్‌ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒడిశా రాష్ట్రం పారాదీప్‌లో బాను జెన్నా అనే వ్యక్తి నుంచి కిలో రూ.2500 చొప్పున 4 కిలోలు కొనుగోలు చేసి బరంపురం చేరుకుని రైలులో చెన్నై వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ పోలీసుల నిఘా ఉండడంతో బస్సులో మందస రోడ్‌ (హరిపురం) వచ్చి చెన్నై వెళ్లేందుకు రైలు కోసం నిరీక్షిస్తున్నా డు. మఫ్టీలో ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌తో పాటు పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేపట్టగా గంజాయి బయట పడింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని గంజాయిని, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

నరసన్నపేటలో 4 కేజీల గంజాయి స్వాధీనం

నరసన్నపేట, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి హైదరాబాద్‌కు 4 కేజీల గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని పోలీసులు గురువారం దేవాది గ్రామం వద్ద హైవేపై అరెస్టు చేసినట్లు సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం భద్రక్‌ జిల్లా పడిసాయి గ్రామానికి చెందిన షేక్‌ గుల్పాన్‌ 4 కేజీల గంజాయిని హైదరాబాద్‌ తీసుకువెళుతున్నాడు. పోలీసు లు వాహనాలను పరిశీలిస్తుండగా నిందితుడు వాహనం దిగి పారిపోతుండ గా అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనంలో గంజాయిని తీసుకువెళుతున్నట్లు గుర్తించి నిందితు డిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరి చామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:32 AM