ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NTR : ఎన్టీఆర్‌.. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక

ABN, Publish Date - May 29 , 2025 | 12:02 AM

Telugu Self-Respect తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక.. నందమూరి తారక రామారావు అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే అంబేడ్కర్‌ ఆడిటోరియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ ప్రసంగించారు.

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తదితరులు
  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 28(ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక.. నందమూరి తారక రామారావు అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే అంబేడ్కర్‌ ఆడిటోరియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ ప్రసంగించారు. ‘నాది మహారాష్ట్ర. చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్‌ గురించి విన్నాను. ఆయన నిజాయితీపరుడు, దూరదృష్టి గల నాయకుడు. రాష్ట్రంలో పింఛను పథకానికి నాంది పలికారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. బ్లాక్‌ సిస్టమ్‌ను తొలగించి, మండల వ్యవస్థనుతీసుకువచ్చి, పరిపాలనను ప్రజల వద్దకే తీసుకువచ్చిన మహనీయుడు. ప్రజావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి, విప్లవాత్మకమైన సామాజిక చైతన్యానికి నాంది పలికిన వ్యక్తి’ అని కలెక్టర్‌ ప్రశంసించారు. ముందుగా వేదికపై అతిథులతో కలిసి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర పఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు, పలువురు ప్రముఖుల ప్రసంగాలు, ఫొటో ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, ఆర్డీవో సాయిప్రత్యూష, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ సతీమణిస్వాతి, మాదారపు వెంకటేష్‌, జామి భీమశంకరరావు, కె.శ్రీహరి పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 02:55 PM