ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sp pressmeet: వైసీపీ నేత హత్య కేసులో రాజకీయ కోణం లేదు

ABN, Publish Date - Jul 14 , 2025 | 11:42 PM

YSRCP leader murder ‘ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో ఇటీవల జరిగిన వైసీపీ నేత సత్తారు గోపి హత్య కేసులో ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఓ భార్యభర్తల తగాదాలో పెద్ద మనుషులమంటూ రెండు వర్గాలు తాము పంచాయతీ చేస్తామని దూరాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న వివాదం కారణంగానే ఈ హత్య జరిగింద’ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
  • తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం

  • ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

  • శ్రీకాకుళం క్రైం, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో ఇటీవల జరిగిన వైసీపీ నేత సత్తారు గోపి హత్య కేసులో ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఓ భార్యభర్తల తగాదాలో పెద్ద మనుషులమంటూ రెండు వర్గాలు తాము పంచాయతీ చేస్తామని దూరాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న వివాదం కారణంగానే ఈ హత్య జరిగింద’ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై తప్పుడు ప్రసారాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ‘ఫరీదుపేటలో 1951 నుంచి గ్రూప్‌ తగాదాలు ఉన్నాయి. గ్రామంలో కొంతమందిని గుర్తించి 114 కేసులు నమోదు చేశాం. మృతుడు సత్తారు గోపీపై సుమారు పది కేసులు ఉన్నాయి. అతనిపై రౌడీషీట్‌ కూడా తెరిచి ఉంది. ఓ భార్యభర్తల తగాదా విషయమే ఈ హత్యకు కారణమైంది. ఎంపీపీ మొదలవలస చిరంజీవి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి భర్త పక్షాన మాట్లాడగా, భార్య పక్షాన మరికొందరు మాట్లాడారు. ఈ వివాదం పెద్దదై గోపి హత్యకు దారి తీసింది. ఫరీదుపేటకు చెందిన కొంతమంది ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించాం. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంకా గ్రామంలో తగాదాలకు పాల్పడిన వారిని గుర్తించి రౌడీషీట్లను తెరుస్తాం. మితిమీరిపోతే పీడీ యాక్ట్‌లు కూడా ఓపెన్‌ చేస్తాం. ఫరీదుపేటను సమస్యాత్మక గ్రామంగా గుర్తించి.. పోలీసు పికెటింగ్‌ కొనసాగిస్తున్నామ’ని ఎస్పీ తెలిపారు.

  • రౌడీషీటర్లపై ఫిర్యాదు వస్తే చర్యలు

  • ‘జిల్లాలో రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశాం. న్యాయపరంగా రౌడీషీటర్లపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటాం. రౌడీషీట్లు మూసివేసిన తర్వాత కూడా కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే.. తిరిగి వారిపై రౌడీషీట్లు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల నగరానికి చెందిన రౌడీషీటర్‌ కుంగ్‌ఫూ శేఖర్‌తో శ్రీకాకుళం రెండో పట్టణ కానిస్టేబుల్‌ త్రినాథరావు ఫోన్‌ సంభాషణ చేసినట్టు గుర్తించాం. కానిస్టేబుల్‌ త్రినాథరావును సస్పెన్షన్‌ చేశాం. శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రాము, కానిస్టేబుల్‌పై కూడా శాఖాపరమైన విచారణ చేపడుతున్నామ’ని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు.

Updated Date - Jul 14 , 2025 | 11:42 PM