ఆకుల్లేవ్.. అన్నీ పూలే..
ABN, Publish Date - Apr 21 , 2025 | 11:58 PM
చెట్లకు ఆకులతో పాటు పూలు ఉండడం సహజం. కానీ రాజాం-శ్రీకాకుళం రోడ్డులో అంతకా పల్లి నుంచి వి.ఆర్.అగ్రహారం జంక్షన్ వరకు.. రహదారికి ఇరువైపులా 40 చెట్లకు ఆకుల్లే కుండా కొమ్మకొమ్మకు తెలుపు, లేత గులాబీ రంగులో పూలు కనువిందు చేస్తున్నాయి.
చెట్లకు ఆకులతో పాటు పూలు ఉండడం సహజం. కానీ రాజాం-శ్రీకాకుళం రోడ్డులో అంతకా పల్లి నుంచి వి.ఆర్.అగ్రహారం జంక్షన్ వరకు.. రహదారికి ఇరువైపులా 40 చెట్లకు ఆకుల్లే కుండా కొమ్మకొమ్మకు తెలుపు, లేత గులాబీ రంగులో పూలు కనువిందు చేస్తున్నాయి. వీటిని ఈ ప్రాంతంలో పచ్చగని లేదా రక్తగంధ అంటారని స్థానికులు చెబుతున్నారు. దీని శాస్ర్తీయ నామం టుబెబూయా అని వృక్షశాస్త్ర అధ్యాపకుడు నవీన్‌కుమార్ ఆంధ్ర జ్యోకి తెలిపారు. వర్షాకాలంలో దట్టంగా ఆకులతో నిండి ఉంటాయని, వేసవికా లంలో ఆకులన్నీ రాలిపోయి పూలు పూస్తాయని ఆయన వెల్లడించారు. మ నదేశంతో పాటు దక్షిణ అమెరికా, మెక్సికో, వెనిజులాలో రోడ్ల పక్కన ఆకర్షణీయంగా ఉండేందుకు వీటిని నాటుతారన్నారు.
-రాజాం రూరల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి)
Updated Date - Apr 21 , 2025 | 11:58 PM