ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నా రాజకీయ జీవితం తెల్లకాగితం: అచ్చెన్న

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:33 PM

అచ్చెన్నాయుడు జీవితం తెల్ల కాగితమని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా వ్యవ హరించానని, ఎక్కడైనా, ఎప్పుడైనా అవినీతికి పాల్ప డినట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పు కుంటానని మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు వైసీపీ నాయకులకు సవాల్‌ విసి రారు.

డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అచ్చెన్న

టెక్కలి, జూలై 19(ఆంధ్రజ్యోతి): అచ్చెన్నాయుడు జీవితం తెల్ల కాగితమని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా వ్యవ హరించానని, ఎక్కడైనా, ఎప్పుడైనా అవినీతికి పాల్ప డినట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పు కుంటానని మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు వైసీపీ నాయకులకు సవాల్‌ విసి రారు. శ్రీనివాస్‌ నగర్‌లో సుపరిపాలనలో తొలిఅడుగులో భాగంగా శనివారం బహిరంగ సభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాయకులకు సిగ్గు, లజ్జా ఉందా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు గ్రావెల్‌ కొండలు దోచుకు తింటున్నాడని, మూలపేట పోర్టులో కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నాడని విమర్శలు చేస్తున్నారని, పోర్టు నిర్మాణం చేస్తున్నది ప్రభుత్వమని గుర్తెరగాలన్నారు. పోర్టు నాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఒక మంత్రి, స్పీకర్‌ కూడా ఉండి చేసిన అభివృద్ధి శూన్యమని, వారు చేసిన అభివృద్ధి ఏమి టో చర్చకు రావాలని మంత్రి సవాల్‌ విసిరారు. పలు సీసీ రోడ్డు పనులకు, డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమం లో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.గోవిందమ్మ, నేతలు ఎల్‌ఎల్‌ నాయుడు, పినకాన అజయ్‌కుమార్‌, హనుమంతు రామకృష్ణ, లవకుమార్‌, కామేసు, రాము, సుందరమ్మ, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే..

ఆమదాలవలస, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుపరిపాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. శనివారం పట్టణంలోని 15వ వార్డు పరిధిలోని మోనింగివారివీధి, పాతినవారి వీధుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటిం టికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతాసాగర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శమ్మ మాధవి, మొదలవలస రమేష్‌, పీవీవీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం: శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌,జూలై19 (ఆంధ్రజ్యోతి)ః ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని, ఇందులో భాగంగానే సంక్షేమపథకాలు, అభి వృద్ధి కార్యక్రమాలు చేపడుతోం దని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం సానివాడ, వప్పంగి గ్రామాల్లో శనివారం సుపరి పాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వ హించారు. ప్రజలు, కార్యకర్తల కోసం నిర్విరామంగా పని చేస్తానన్నారు. కార్యక్ర మంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలతో ఆనందం

పాటపట్నం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ సంక్షేమ పథ కాలు ప్రజలలో ఆనందోత్సాహాలు నింపుతున్నాయని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు అన్నారు. కె.గోపాల పురంలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజలకు ఎంతో మేఉ

కాశీబుగ్గ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస కాశీబుగ్గ మున్సి పాలిటీ పరిధిలో గల 12వ వార్డు పల్లివీధిలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్య క్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటిఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పథకాలపె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ప్రజా పాలనలో కొత్త అధ్యాయం

కొత్తూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి) కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం ప్రజా పాలనలో కొత్త అధ్యాయంగా నిలుస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి ప్రజలకు వివరించారు. శనివారం పొనటూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికీ కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పొత్రకొండ మోహనరావు, కుద్దిగాం సర్పంచ్‌ నెల్లి అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:33 PM