ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

crime news: బావిలో దూకి..

ABN, Publish Date - Apr 27 , 2025 | 11:23 PM

Mother and daughter Suicide నాలుగు రోజుల కిందట ఓ బాలిక విశాఖ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తాజాగా ఆ బాలిక అమ్మ, అమ్మమ్మ(తల్లీకుమార్తెలు) శ్రీకాకుళం మండలం గూడెంలో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. తల్లీకుమార్తెలిద్దరూ మెడకు చున్నీ బిగించుకుని బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఆదివారం ఉదయం వెలుగుచూసింది.

  • తల్లీకుమార్తె ఆత్మహత్య

  • శ్రీకాకుళం మండలం గూడెంలో విషాదం

  • ఇటీవల అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

  • విశాఖ ఐదో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

  • డెంకాడ నుంచి స్వగ్రామానికి వచ్చి ప్రాణాలు తీసుకున్న వైనం

  • శ్రీకాకుళం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): నాలుగు రోజుల కిందట ఓ బాలిక విశాఖ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తాజాగా ఆ బాలిక అమ్మ, అమ్మమ్మ(తల్లీకుమార్తెలు) శ్రీకాకుళం మండలం గూడెంలో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. తల్లీకుమార్తెలిద్దరూ మెడకు చున్నీ బిగించుకుని బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఆదివారం ఉదయం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం మండలం గూడెం గ్రామానికి చెందిన మోది సావిత్రమ్మ(55), ఈమె కుమార్తె ఈదల వరలక్ష్మి(32) శనివారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లీ కుమార్తెలిద్దరూ 15 ఏళ్ల కిందట గూడెంలో ఇంటిని విక్రయించి.. ఉపాధి కోసం విజయనగరం జిల్లా డెంకాడ వెళ్లిపోయారు. వరలక్ష్మికి 12 ఏళ్ల కిందట శ్రీనివాస్‌ అనే వ్యక్తితో వివాహం కాగా.. ఈ దంపతులకు పూర్తిచంద్రిక(11) అనే కుమార్తె ఉంది. చిన్న చిన్న తగాదాల కారణంగా నాలుగేళ్ల నుంచి శ్రీనివాస్‌, వరలక్ష్మి వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో వరలక్ష్మి తన తల్లి సావిత్రమ్మతో కలిసి డెంకాడలో చీకులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి వద్దనే ఉంటున్న బాలిక పూర్ణచంద్రికకు ఈ నెల 24న దెయ్యం పట్టిందని.. ప్రార్థనలు చేయించేందుకు విశాఖ జిల్లా జ్ఞానాపురంలో చర్చికి సావిత్రమ్మ, వరలక్ష్మి తీసుకువెళ్లారు. అక్కడ అనుమానాస్పద స్థితిలో పూర్ణచంద్రిక మృతి చెందింది. ఈ ఘటనపై శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ ఐదో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

  • ఇదిలా ఉండగా.. డెంకాడ నుంచి సావిత్రమ్మ, వరలక్ష్మి తమ స్వస్థలమైన గూడెం గ్రామానికి శనివారం వచ్చారు. వారిద్దరూ రాత్రివేళ మెడకు చున్నీ బిగించుకుని ఓ బావిలో దూకేశారు. ఆదివారం వేకువ జామున మృతదేహాలు నీటిపై తేలుతుండటంతో విషయం బయటపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది వచ్చి.. మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం వాటిని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు శ్రీకాకుళం రూరల్‌ పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ రాము తెలిపారు. జ్ఞానాపురంలో బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం.. ఆ తర్వాత పరిణామాలతో సావిత్రమ్మ, వరలక్ష్మి ఆందోళన చెంది.. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గూడెంలో విషాదం అలుముకుంది.

Updated Date - Apr 27 , 2025 | 11:23 PM