ఆదిత్యుని సేవలో మంత్రి ఆనం
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:11 AM
ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి శుక్ర వారం దర్శించుకున్నారు.
అరసవల్లి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి శుక్ర వారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేదాశీర్వ చనం, ప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదిత్యుని దయవల్ల ఏడాది పాలన విజయవం తంగా పూర్తయిందన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ప్రజల మన్ననలను పొందగలిగామని చెప్పారు. స్వామివారి కృపతో మరింత మెరుగైన పాలన అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జేసీ త్రినాథరావు, డీసీలు శోభారాణి, సుజాత, జిల్లా దేవదాయశాఖ అధికా రులు, అర్చకులు ఇప్పిలి సాందీపశర్మ, రంజిత్ శర్మ పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 12:11 AM