22న శ్రీకాకుళంలో మినీ మహానాడు
ABN, Publish Date - May 18 , 2025 | 11:51 PM
శ్రీకాకుళంలో ఈనెల 22న నిర్వహించే మినీ మహానాడును జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కల మట వెంకటరమణ పిలుపునిచ్చారు.
అరసవల్లి, మే 18(ఆంధ్రజ్యోతి) శ్రీకాకుళంలో ఈనెల 22న నిర్వహించే మినీ మహానాడును జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కల మట వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని 80 అడు గుల రోడ్డులోగల జిల్లాపార్టీ కార్యాలయంలో మినీమహానాడు ఏర్పాట్ల సన్నా హాలపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగేకార్యక్రమానికి కేంద్ర,రాష్ట్ర మంత్రులు కిం జరాపు రామ్మోహన్‌నాయుడు,అచ్చెన్నాయుడు, జిల్లాలోనిఎమ్మెల్యేలు, కార్పొ రేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గసభ్యులు, ప్రముఖులు హాజ రవుతారని తెలిపారు.కార్యక్రమంలో మెండ దాసునాయుడు, పీఎంజే బాబు, మాదారపు వెంకటేష్, పాండ్రంకిశంకర్, కొమ్మనాపల్లి వెంకటరామరాజు, తో ణంగి వెంకన్నయాదవ్, ఎస్వీ రమణమాదిగ, విభూది సూరిబాబు, కవ్వాడి సుశీల, బోనిగి భాస్కరరావు పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 11:51 PM