ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వేడుకగా మినీ మహానాడు

ABN, Publish Date - May 21 , 2025 | 12:01 AM

నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడు వేడుకలు మంగళవారం సందడిగా నిర్వహించారు. నరసన్నపేట, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లోని పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పోలాకి:మినీ మహానాడులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడు వేడుకలు మంగళవారం సందడిగా నిర్వహించారు. నరసన్నపేట, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లోని పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నరసన్నపేటలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పాతపట్నంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పలాసలో మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ పార్టీ పతాకాలను ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున క్యాడర్‌ పాల్గొంది.

తెలుగోడి సత్తాను చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

పోలాకి, మే 20(ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల సత్తాను ప్రపంచానికి చాటిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్‌ అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. రాళ్లపాడు గ్రామ సమీపంలోని జీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం నరసన్నపేట నియోజకవర్గ మినీ మహా నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ తర్వాత దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు పార్టీని కేంద్ర స్థాయిలో ముందుకు నడిపించారన్నారు. తండ్రి ఆశయాలతో ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడు చిన్న వయసులో కేంద్రమంత్రి స్థా యికి ఎదిగి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం, పార్టీ కోసం నిద్రాహారాలుమాని సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు విగ్ర హాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కడపలో నిర్వహించనున్న మహా నాడుకు తరలిరావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నరసన్నపేట నియోజవర మినీ మహానాడు పరిశీలకుడు కోయిలడ వెంకటేశ్వరరావు, పార్టీ సమన్వయకర్త బగ్గు అర్చన, కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, టీడీపీ నేతలు ఎంవీనాయుడు, కేవీరమణ, డి.తేజ, జగదీశ్వరరావు, బీబీ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ

పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు

పాతపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి): పాలన సం స్కరణలకు, సంక్షేమానికి శ్రీకారం చుట్టి పార్టీలకు మార్గదర్శకంగా టీడీపీ నిలి చిందని, క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం పాత పట్నంలో మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత దివంగత సీఎం, పార్టీ వ్యవస్థాప కుడు ఎన్టీఆర్‌కు దక్కింద న్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.650 కోట్లు నిధు లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యం లో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహా నికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పలు అంశా లపై తీర్మానం చేశారు. టీడీపీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు మృతి చెందితే మామిడి అప్పారావు చారిటబుల్‌ ట్రస్ట్‌ నుంచి రూ. 50 వేలు బీమా సౌకర్యాన్ని వ్యక్తిగతంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నియోజక వర్గంలోని ఐదు మండలాల ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ హయాంలోనే సంస్కరణలు

ఫ మాజీ మంత్రి శివాజీ

పలాస, మే 20(ఆంధ్రజ్యోతి): ప్రపంచ స్థాయిలో తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చి టీడీపీ ఘనకీర్తి పొందిందని, టీడీపీ హయాంలోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు అనేక సంస్కరణలు వచ్చాయని మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ అన్నారు. పార్టీ వ్యవ స్థాపకుడిగా దివంగత సీఎం ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో ఉంటా రన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం పలాస నియోజక వర్గ మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కిలో బియ్యం రూ.2, కూడు, గుడ్డ, గూడు అన్ని వర్గాల ప్రజలకు అందాల న్నదే ఎన్టీఆర్‌ ఆశయమని, అదే మార్గంలో సీఎం చంద్రబాబు నాయు డు ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. కష్ట కాలంలో వెన్నంటే ఉన్న కార్యకర్తల రుణాన్ని తీర్చుకుంటామని, భవి ష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి నియోజకవర్గాన్ని ప్రథ మ స్థానం లో ఉంచుదామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీషలను అభినందిస్తూ తీర్మానం ఆమోదించారు. 11 అంశాలపై తీర్మానం చేశారు. పహల్గాం మృతులు, ఆపరేషన్‌ సిందూర్‌లో అమరులైన జవాన్‌లకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి, నేతలు పీరుకట్ల విఠల్‌రావు, సూరాడ మోహనరావు, బడ్డ నాగరాజు, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, గాలి కృష్ణారావు, శాసనపురి మురళీకృష్ణ, ఎం.నరేంద్ర (చిన్ని), యవ్వారి మోహనరావు, డిక్కల ఆనంద్‌, తమ్మినాన గంగారామ్‌, దడియాల నర్సింహులు, నియోజక వర్గంలోని నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:01 AM