యోగా సాధనతో మానసిక వికాసం
ABN, Publish Date - May 24 , 2025 | 11:42 PM
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘యోగా ఆంధ్ర’లో భాగంగా శనివారం పలాస, టెక్కలి, నరసన్నపేటల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది యోగాభ్యాసం చేశారు.
పలాస/కాశీబుగ్గ/టెక్కలి/నరసన్నపేట, మే 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘యోగా ఆంధ్ర’లో భాగంగా శనివారం పలాస, టెక్కలి, నరసన్నపేటల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది యోగాభ్యాసం చేశారు. పలాస, టెక్కలిల్లో ఆర్డీవోలు జి.వెంకటేష్, ఎం.కృష్ణమూర్తి యోగాలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు యోగాను దినచర్యగా చేసుకోవాలన్నారు. దీనివల్ల ఆరోగ్యం సిద్ధించడంతోపాటు మానసిక వికాసం కలుగుతుందన్నారు. వైద్యులు ప్రవీణ్‌కుమార్, ఆకుల ప్రకాష్, శివ, విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. అలాగే నరసన్నపేటలో యోగా ఆంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదనరావు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 24 , 2025 | 11:42 PM