DSC: మెగా డీఎస్సీ
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:52 AM
543 Posts to be Filled ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది.
నోటిఫికేషన్ జారీకి అనుమతిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
జిల్లాలో 543 పోస్టుల భర్తీ ఫ నిరుద్యోగుల్లో ఆనందోత్సాహం
నరసన్నపేట, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల ముందు మాత్రం హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తక్కువ ఉద్యోగాలకు ఇవ్వడంపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనలు చేశారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ప్రచారంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనుకున్నట్లే సీఎం కాగానే డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రవాప్తంగా 16,347 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేసింది. టెట్ నిర్వహించి నవంబరులోనే ఫలితాలు ప్రకటించింది. ఇటీవల సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జూన్‌నాటికి పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని ప్రకటించారు. తాజాగా నోటిఫికేషన్ జారీకి అనుమతిచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల విద్యాశాఖ విభాగానికి సంబంధించి 458 ఉపాధ్యాయ ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ ద్వారా మరో 85 పోస్టులు మొత్తంగా 543 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ యాజమాన్యం పరిఽధిలోగల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌కు సంబంధించి తెలుగు 31, హిందీ- 11, ఇంగ్లీషు-64, గణితం -33, భౌతికశాస్త్రం- 14, బయాలజీ -32, సోషల్ -66, ఫిజికల్ ఎడ్యుకేషన్ -81, ఎస్జీటీలు -72 పోస్టులు మొత్తం 407 భర్తీ చేయనున్నారు. అలాగే మునిసిపాలిటీ పరిధిలోని పాఠశాలలో తెలుగు -3, హిందీ- ఒకటి, ఇంగ్లీషు - ఒకటి, బయాలజీ- ఒకటి, సోషల్ -5, ఫిజికల్ ఎడ్యుకేషన్ -1, ఎస్జీటీలు -39 మొత్తం 51 పోస్టులు ఉన్నాయి.
ట్రైబల్ వెల్ఫేర్‌కు సంబంధించి ఇంగ్లిష్ -12, మ్యాథ్స్ -13, పీఎస్ -10, బయాలజీ-12, సోషల్ -5, ఎస్జీటీ -33 చొప్పున 85 పోస్టులు భర్తీ కానున్నాయి.
Updated Date - Apr 20 , 2025 | 12:52 AM