ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్కడ వైద్యం ‘దూరం’

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:49 PM

అక్కడ వైద్యం ‘దూరం’ రోగిని దగ్గరకు రానివ్వని వైద్యులు రెండు మీటర్లు దూరం ఉండాల్సిందే టార్చిలైటు వేసి చూసి జబ్బు అంచనా రోగులు, బంధువుల తీవ్ర అసంతృప్తి విజయనగరం రింగురోడ్డు, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): చర్మవ్యాధితో బాధపడుతున్న గంట్యాడ మండలానికి చెందిన కృష్ణ రెండు రోజులు క్రితం చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆశ్రయించాడు. అక్కడ ఓపీ తీసుకున్న తరువాత చర్మవ్యాధులను పరీక్షించే గదికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఓ డాక్టరు(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) కృష్ణను పరీక్షించే తీరు చాలా విచిత్రంగా కన్పించింది. కృష్ణను రెండు మీటర్ల దూరంలో ఉంచి సమస్య అడిగి అక్కడి నుంచే టార్చిలైటు వెలుగులో పరీక్షించారు. ఆపై ఎదురుగా కూర్చున్న ముగ్గురు సిబ్బందితో మందులు రాయించి కృష్ణను పంపించేశారు. కృష్ణకు తన సమస్యను పూర్తిస్థాయిలో చెప్పుకునే ఆవకాశం లేకుండా పోయింది. దీనిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విభాగానికి వచ్చే రోగులందరికీ నిత్యం ఇదే సమస్య ఎదురవుతోంది. తమ సమస్యను వివరంగా చెప్పుకునే అవకాశం లేకుండా దూరం నుంచే వైద్యులు చూసి అంచనా వేస్తున్నారు. వైద్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చర్మవ్యాధికి సంబంధించి సమస్యలుంటే రోగులను దగ్గరగా చూసి పరిశీలిస్తేనే ఆ వ్యాధి ఏమిటన్నది స్పష్టంగా తెలుస్తుందని చర్మవ్యాధుల వైద్యుడొకరు తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆ పరిస్థితి లేదు. దూరం నుంచి పరిశీలించి తూతూమంత్రంగా చికిత్స చేయడంతో సమస్యలు తగ్గడం లేదని రోగులు పెదవి విరుస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నామంటున్నారు. కొంతమంది సిబ్బంది కూడా రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే ఇక్కడ వైద్యుల తీరు బాగోలేదని మరో బాధితుడు వాపోయాడు. - గత నెలలో ఇన్‌చార్జి మంత్రి సమక్షంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లు, అసోసియేట్‌ ఫ్రొఫెసర్లు ఉన్నా, ఆధునిక పరికరాలు ఉన్నా రోగులను పూర్తిస్థాయిలో పరీక్షించకుండా కేజీహెచ్‌కు పంపిస్తున్నారంటూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రస్తావించారు. ఆయన మాటలకు మద్దతుగా వైద్యులు, సిబ్బంది తీరు కనిపిస్తోంది. ఇదే విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎస్‌.అప్పలనాయుడు వద్ద ప్రస్తావిం చగా రోగుల పట్ల వైద్యులు అలా ఉండకూడదని, దీనిని పరిశీలించి మాట్లాడుతానన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఆసుపత్రిలో ఫిర్యాదుల బాక్సు ఉందని, అందులో ఫిర్యాదు కాపీ వేయవచ్చునని వెల్లడించారు. 29 డీజెడ్పీ 7: జిల్లా సర్వజన ఆస్పత్రిలో చర్మవ్యాధులను పరీక్షించే గది వద్ద రోగులు

జిల్లా సర్వజన ఆస్పత్రిలో చర్మవ్యాధులను పరీక్షించే గది వద్ద రోగులు

విజయనగరం రింగురోడ్డు, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): చర్మవ్యాధితో బాధపడుతున్న గంట్యాడ మండలానికి చెందిన కృష్ణ రెండు రోజులు క్రితం చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆశ్రయించాడు. అక్కడ ఓపీ తీసుకున్న తరువాత చర్మవ్యాధులను పరీక్షించే గదికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఓ డాక్టరు(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) కృష్ణను పరీక్షించే తీరు చాలా విచిత్రంగా కన్పించింది. కృష్ణను రెండు మీటర్ల దూరంలో ఉంచి సమస్య అడిగి అక్కడి నుంచే టార్చిలైటు వెలుగులో పరీక్షించారు. ఆపై ఎదురుగా కూర్చున్న ముగ్గురు సిబ్బందితో మందులు రాయించి కృష్ణను పంపించేశారు. కృష్ణకు తన సమస్యను పూర్తిస్థాయిలో చెప్పుకునే ఆవకాశం లేకుండా పోయింది. దీనిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విభాగానికి వచ్చే రోగులందరికీ నిత్యం ఇదే సమస్య ఎదురవుతోంది. తమ సమస్యను వివరంగా చెప్పుకునే అవకాశం లేకుండా దూరం నుంచే వైద్యులు చూసి అంచనా వేస్తున్నారు. వైద్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చర్మవ్యాధికి సంబంధించి సమస్యలుంటే రోగులను దగ్గరగా చూసి పరిశీలిస్తేనే ఆ వ్యాధి ఏమిటన్నది స్పష్టంగా తెలుస్తుందని చర్మవ్యాధుల వైద్యుడొకరు తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆ పరిస్థితి లేదు. దూరం నుంచి పరిశీలించి తూతూమంత్రంగా చికిత్స చేయడంతో సమస్యలు తగ్గడం లేదని రోగులు పెదవి విరుస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నామంటున్నారు. కొంతమంది సిబ్బంది కూడా రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే ఇక్కడ వైద్యుల తీరు బాగోలేదని మరో బాధితుడు వాపోయాడు.
- గత నెలలో ఇన్‌చార్జి మంత్రి సమక్షంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లు, అసోసియేట్‌ ఫ్రొఫెసర్లు ఉన్నా, ఆధునిక పరికరాలు ఉన్నా రోగులను పూర్తిస్థాయిలో పరీక్షించకుండా కేజీహెచ్‌కు పంపిస్తున్నారంటూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రస్తావించారు. ఆయన మాటలకు మద్దతుగా వైద్యులు, సిబ్బంది తీరు కనిపిస్తోంది. ఇదే విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎస్‌.అప్పలనాయుడు వద్ద ప్రస్తావిం చగా రోగుల పట్ల వైద్యులు అలా ఉండకూడదని, దీనిని పరిశీలించి మాట్లాడుతానన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఆసుపత్రిలో ఫిర్యాదుల బాక్సు ఉందని, అందులో ఫిర్యాదు కాపీ వేయవచ్చునని వెల్లడించారు.

Updated Date - Jun 30 , 2025 | 11:49 PM