ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయి నియంత్రణకు చర్యలు

ABN, Publish Date - Jul 01 , 2025 | 11:29 PM

జిల్లాలో గంజాయి తదితర మత్తు పదార్థాల అక్రమ నిల్వలు, రవాణా లను అరికట్టే చర్యల్లో భాగంగా మంగళవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీ చేపట్టినట్లు టెక్కలి అర్బన్‌ ఎస్‌ఐ రాము తెలిపారు.

టెక్కలి, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి తదితర మత్తు పదార్థాల అక్రమ నిల్వలు, రవాణా లను అరికట్టే చర్యల్లో భాగంగా మంగళవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీ చేపట్టినట్లు టెక్కలి అర్బన్‌ ఎస్‌ఐ రాము తెలిపారు. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌, ముఖ్య కూడళ్లు, అనుమానిత ప్రదేశాలు, దుకాణాలు, వాహనాలను తనిఖీ చేపట్టాన్నారు. గంజాయి రవాణాకు పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా గంజాయి రవాణా చేపడితే సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

చికిత్స పొందుతూ కార్మికుడి మృతి

కోటబొమ్మాళి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): పాము కాటుకు గురై రిమ్స్‌లో చికిత్స పొందుతూ గ్రానైట్‌ కార్మికుడు మంగళవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నిమ్మాడ గ్రామ సమీపంలోని కేఎల్‌ఆర్‌ గ్రానైట్‌ పరిశ్రమలో పశ్చిమ బెంగాల్‌కు రాష్ట్రం పురులియా జిల్లా బోరోర్‌మా గ్రామానికి చెందిన తారకేశ్వర మహాతో (22) నాలుగు నెలల నుంచి పనిచేస్తున్నాడు. గతనె 29న రాత్రి 10 గంటల సమయంలో పని ముగించుకొని రూంలోకి నిద్రించారని, 30న వేకువజామున తార కేశ్వర మహాతో తనకు పాము కరిచిందని అన్న రవి మహాతోకు చెప్ప డంతో వెంటనే పరిశ్రమ సూపరింటెండెంట్‌ కె.లక్ష్మణరావుకు అతడు సమాచారం ఇచ్చాడు. వెంటనే నరసన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించ గా మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి సోదరుడు రవి మహాతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

Updated Date - Jul 01 , 2025 | 11:30 PM